Breaking News

చరిత్ర సృష్టించిన టీమిండియా.. టెస్టు క్రికెట్ హిస్టరీలోనే

Published on Sun, 07/06/2025 - 08:49

ఎడ్జ్‌బాస్ట‌న్ వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న రెండో టెస్టులో టీమిండియా విజ‌యం దిశ‌గా ప‌య‌నిస్తోంది. 608 పరుగుల భారీ ల‌క్ష్య‌ ఛేదనలో ఇంగ్లండ్‌ టాపార్డర్‌ తడబడింది. నాలుగో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి ఇంగ్లండ్ త‌మ రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు కోల్పోయి 72 ప‌రుగులు చేసింది. భార‌త్‌ విజ‌యానికి ఇంకా 7 వికెట్లు అవ‌స‌రం కాగా.. ఇంగ్లండ్ గెలుపున‌కు 536 ప‌రుగులు కావాలి.

ఇక ఈ ఎడ్జ్‌బాస్ట‌న్ టెస్టులో గిల్ సార‌థ్యంలోని భార‌త జ‌ట్టు స‌రికొత్త చ‌రిత్ర సృష్టించింది. భారత తమ టెస్టు క్రికెట్ హిస్టరీలో ఓ మ్యాచ్‌లో 1000కు పైగా పరుగులు చేయడం ఇదే తొలిసారి. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగులు చేసిన టీమిండియా.. రెండో ఇన్నింగ్స్‌లో 427 పరుగులు చేసింది.

మొత్తం రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 1014 పరుగులు నమోదు చేసింది. ఇప్పటివరకు 2004లో సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియాపై చేసిన 916 పరుగులకే భారత్‌కు అత్యధికం. తాజా మ్యాచ్‌తో చరిత్రను యంగ్ టీమిండియా తిరగ రాసింది.

అదరగొట్టిన గిల్‌..
ఇక ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌లోనూ భారత కెప్టెన్ శుబ్‌మన్ గిల్ అదరగొట్టాడు. మొదటి ఇన్నింగ్స్‌లో ద్విశతకంతో చెలరేగిన శుబ్‌మన్‌.. రెండో ఇన్నింగ్స్‌లో (162 బంతుల్లో 161; 13 ఫోర్లు, 8 సిక్స్‌లు) శతకంతో కదం తొక్కాడు. దీంతో భారత్ తమ సెకెండ్ ఇన్నింగ్స్‌ 83 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 427 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది.

భారత బ్యాటర్లలో గిల్‌తో పాటు రవీంద్ర జడేజా (118 బంతుల్లో 69 నాటౌట్‌; 5 ఫోర్లు, 1 సిక్స్‌), రిషభ్‌ పంత్‌ (58 బంతుల్లో 65; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు), కేఎల్‌ రాహుల్‌ (84 బంతుల్లో 55; 10 ఫోర్లు) అర్ధ శతకాలతో రాణించారు. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన ఆధిక్యాన్ని జోడించి ఇంగ్లండ్‌ ముందు 608 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ఉంచింది.
చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన టీమిండియా.. టెస్టు క్రికెట్ హిస్టరీలోనే

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)