Breaking News

రో-కో ఫ్యాన్స్‌కు గ్రేట్‌ న్యూస్‌

Published on Wed, 01/14/2026 - 12:03

టీమిండియా బ్యాటింగ్‌ దిగ్గజాలు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లికు సంబంధించి బిగ్‌ న్యూస్‌ అందుతుంది. గత కొద్ది రోజులుగా ఈ ఇద్దరి కెరీర్‌ భవితవ్యంపై రకరకాల ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో.. టీమిండియా బ్యాటింగ్‌ కోచ్‌ సితాంషు కోటక్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

రో-కో టీమిండియా 2027 వరల్డ్‌కప్ ప్రణాళికల్లో కీలక భాగమని అధికారికంగా ధృవీకరించాడు. ఈ ప్రకటనతో రో-కో భవితవ్యంపై స్పష్టత వచ్చింది. వారి ఫ్యాన్స్‌ ఆనందంలో మునిగి తేలుతున్నారు. తమ ఆరాధ్య ఆటగాళ్లు 2027 వరకు తమకు అలరిస్తారని తెలిసి ఉబ్బితబ్బిబవుతున్నారు.

ఇంతకీ కోటక్‌ ఏమన్నాడంటే.. మేనేజ్‌మెంట్‌, రో-కో మధ్య ఎలాంటి కమ్యూనికేషన్ గ్యాప్‌ లేదు. కోచ్‌ గౌతమ్ గంభీర్‌తో వీరిద్దరూ తరచూ చర్చలు జరుపుతున్నారు. 2027 వరల్డ్‌కప్ ప్రణాళికలపై వీరి అనుభవం జట్టుకు మార్గదర్శకంగా ఉంటుంది.

వీరిద్దరూ చాలా ప్రొఫెషనల్. ప్రాక్టీస్, ఫిట్‌నెస్, ప్రణాళికల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. అవసరమైతే ముందుగానే వేదికకు వెళ్లి ప్రాక్టీస్ చేస్తారు. జట్టులోని ఇతర ఆటగాళ్లతో తమ అనుభవాన్ని పంచుకుంటారు. వీరికి చెప్పాల్సిన అవసరం లేదు. వారు స్వయంగా ప్రణాళికలు రూపొందిస్తారని కోటక్ అన్నాడు.  

కోటక్‌ చేసిన ఈ వ్యాఖ్యలు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి కెరీర్‌ భవితవ్యంపై పూర్తి క్లారిటీ ఇచ్చాయి. రో-కో ప్రస్తుతం స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో బిజీగా ఉన్నారు. వీరిద్దరు ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. 

ముఖ్యంగా విరాట్‌ కోహ్లి ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాడు. మొదటి వన్డేలో అతను 93 పరుగులు చేసి, తృటిలో మరో శతకాన్ని మిస్‌ అయ్యాడు. ఆ మ్యాచ్‌లో రోహిత్ 26 పరుగులే చేసినా, క్రీజ్‌లో ఉన్నంత సేపు తనదైన శైలిలో మెరుపులు మెరిపించాడు.

ఇవాళ రాజ్‌కోట్‌ వేదికగా రెండో వన్డే జరుగనుంది. ఈ మ్యాచ్‌లోనూ రో-కో తమ అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తారని అభిమానులు ఆశాభావం​ వ్యక్తం చేస్తున్నారు.  

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)