Breaking News

CWG 2026: ఇవాళ భారత్‌కు పత​కాల పంట

Published on Sat, 08/01/2026 - 13:05

గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌ 2026లో శనివారం (ఆగస్ట్‌ 1) భారత్‌కు అత్యంత కీలకమైన రోజు కానుంది. ఈ ఎడిషన్‌లో ఇప్పటికే 23 పతకాలు (5 స్వర్ణాలు, 12 రజతాలు, 6 కాంస్యాలు) సొంతం చేసుకున్న భారత్‌.. ఇవాళ మరిన్ని అద్భుత ప్రదర్శనలు చేస్తే మరో 25 పతకాలు ఖాతాలో చేరే అవకాశం ఉంది.

బాక్సింగ్‌లో 10 పతకాలు ఖాయం
భారత్‌కు అత్యధిక పతక అవకాశాలు బాక్సింగ్‌లో ఉన్నాయి. ఇప్పటికే 10 మంది భారత బాక్సర్లు సెమీఫైనల్స్‌ దాటి ఫైనల్‌కు చేరుకోవడంతో 10 పతకాలు ఖాయమయ్యాయి. వీరిలో ప్రీతి, జాస్మిన్, జడుమణి సింగ్, సాక్షి, ప్రియా, అరుంధతి చౌదరి, లవ్లీనా బోర్గోహైన్, సచిన్, అంకుష్ పాంగల్, నరేందర్ ఉన్నారు.

వీరంతా ఫైనల్స్‌లో విజయం సాధిస్తే భారత్‌కు బాక్సింగ్‌లోనే 10 స్వర్ణ పతకాలు వచ్చే అవకాశం ఉంది.

అథ్లెటిక్స్‌లో 8 పతకాలపై కన్ను
అథ్లెటిక్స్‌లోనూ భారత్‌కు భారీ అవకాశాలున్నాయి. పురుషుల ట్రిపుల్ జంప్ ఫైనల్లో ప్రవీణ్ చిత్రవేల్, సెల్వ ప్రభు తిరుమారన్, మహిళల 10,000 మీటర్ల రేస్ వాక్‌లో ప్రియాంక గోస్వామి, రవీనా గాయక్వాడ్, పురుషుల పోల్ వాల్ట్‌లో దేవ్ కుమార్ మీనా, కుల్దీప్ కుమార్ బరిలోకి దిగనున్నారు.

అలాగే పురుషుల 5000 మీటర్ల ఫైనల్లో గుల్వీర్ సింగ్, మిక్స్‌డ్ 4x400 మీటర్ల రిలేలో భారత జట్టు పతకం కోసం పోటీ పడనుంది.

పారా అథ్లెటిక్స్‌లో 3 అవకాశాలు
పురుషుల షాట్‌పుట్ F57 ఫైనల్లో సోమన్ రాణా, శుభమ్ జుయాల్, పురుషుల 1500 మీటర్ల T54 ఫైనల్లో రమేశ్ షణ్ముగం పతకాల కోసం పోటీ పడనున్నారు.

జూడోలో మరో 4 అవకాశాలు
జూడోలో ఉన్నతి శర్మ, కరణ్‌జిత్ సింగ్ మాన్, హర్ష్ తోకస్, ఇనుంగన్బి తఖెల్లంబమ్ తమ తమ విభాగాల్లో ముందడుగు వేస్తే భారత్ పతకాల సంఖ్య మరింత పెరగనుంది.

ఇవాళ భారత్‌ పతకాల అంచనా

* బాక్సింగ్: 10
* అథ్లెటిక్స్: 8
* పారా అథ్లెటిక్స్: 3
* జూడో: 4

కాగా, ప్రస్తుతం పతకాల పట్టికలో 10వ స్థానంలో ఉన్న భారత్‌.. ఇవాల్టి ప్రదర్శనల తర్వాత ఒక్కసారి భారీ జంప్‌ కొట్టే అవకాశం ఉంది. ఒకవేళ స్వర్ణాలు ఎక్కువ సాధిస్తే.. ఆస్ట్రేలియా (128), ఇంగ్లండ్‌ (80), కెనడా (53) తర్వాత నాలుగో స్థానానికి చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు. 

Videos

సచివాలయ ఉద్యోగులంటే చంద్రబాబుకు ఎందుకింత కక్ష..?

పెళ్లి చూసుకున్నవాళ్లకే దిక్కులేదు... 15 ఏళ్ళు కలిసుంటారట..!

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

ఓ బ్రాహ్మణ్ పై కక్ష్య సాధిస్తే... వేమిరెడ్డి దంపతులు ఇది నా ఆక్రందన! శ్రావణ్ శర్మ సతీమణి

సచివాలయం ఉద్యోగులను ఎలా ఈడ్చుకెళ్తున్నారో చూడండి

ఈసీ నియామక విధానంపై జగన్ ప్రశ్నలు.. అసలు వివాదం ఏంటి?

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు అకౌంట్లోకి 20,000

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

Photos

+5

AP: సచివాలయ ఉద్యోగుల తిరుగుబాటు..!(ఫొటోలు)

+5

ఎర్రచీరలో అందంగా శోభిత చెల్లి సమంత (ఫొటోలు)

+5

'ఆదర్శ కుటుంబం'లోని నారాయణమ్మ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

భర్తతో కలిసి మలేసియా ట్రిప్‌లో హీరోయిన్ అపర్ణ(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో కేసీఆర్‌ని పోలిన పాత్ర.. షూటింగ్‌లో ఇలా(ఫొటోలు)

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)