రెండో టీ20లో జింబాబ్వే చిత్తు.. సిరీస్‌ టీమిండియాదే

Published on Sat, 07/25/2026 - 19:59

హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో 90 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలుండగానే మూడు టీ20ల సిరీస్‌ను 2-0తో టీమిండియా సొంతం చేసుకుంది.  ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. 

భారత ఇన్నింగ్స్‌లో ఇషాన్‌ కిషన్‌(44 బంతుల్లో 9 ఫోర్లు,2 సిక్స్‌లతో 1), తిలక్‌ వర్మ(29 బంతుల్లో 60 నాటౌట్‌) హాఫ్‌ సెంచరీలతో సత్తాచాటారు. జింబాబ్వే బౌలర్లలో ముజార్‌బానీ, నగరవా, బెన్నెట్‌, న్యూమన్ న్యాముహురి తలా వికెట్‌ సాధించారు.

అదరగొట్టిన అభిషేక్‌
అనంతరం 220 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 17.5 ఓవర్లలో 129 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో పార్ట్‌టైమ్‌ స్పిన్నర్‌ అభిషేక్‌ శర్మ మూడు వికెట్లతో సత్తాచాటగా.. ప్రిన్స్‌ యాదవ్‌, యశ్‌ ఠాకూర్‌ తలా రెండు వికెట్లు పడగొట్టారు. వీరితో పాటు రవి బిష్ణోయ్‌, దూబే, తిలక్‌కు ఒక్కో వికెట్‌ దక్కింది. 

జింబాబ్వే బ్యాటర్లలో బెన్నెట్‌(32) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. కాగా భారత కెప్టెన్‌గా శ్రేయస్‌ అయ్యర్‌కు ఇదే తొలి సిరీస్‌ విజయం కావడం గమనార్హం. కాగా జింబాబ్వే టూర్‌కు ముందు ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లను భారత్‌ కోల్పోయిన సంగతి తెలిసిందే.

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)