Breaking News

7 వికెట్లతో చెలరేగిన షమీ.. కివీస్‌పై గ్రాండ్‌​ విక్టరీ! ఫైనల్లో టీమిండియా

Published on Wed, 11/15/2023 - 22:50

వన్డేప్రపంచకప్‌-2023 ఫైనల్లో టీమిండియా అడుగుపెట్టింది. వాంఖడే వేదికగా జరిగిన తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్‌ను 70 పరుగుల తేడాతో ఓడించిన భారత్‌.. ఫైనల్‌ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. వరల్డ్‌కప్‌ 398 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ 48.5 ఓవర్లలో 327 పరుగులకు ఆలౌటైంది. కివీస్‌ బ్యాటర్లలో డార్లీ మిచెల్‌(134) విరోచిత శతకంతో పోరాడినప్పటికీ.. తన జట్టును ఫైనల్‌కు చేర్చలేకపోయాడు. మిచెల్‌తో పాటు కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌(69) పర్వాలేదన్పించాడు. 

7 వికెట్లతో చెలరేగిన షమీ..
భారత బౌలర్లలో మహ్మద్‌ షమీ అద్భుమైన ప్రదర్శన కనబరిచాడు. ఏకంగా 7 వికెట్లు పడగొట్టి కివీస్‌ పతనాన్ని శాసించాడు. ఓవరాల్‌గా 9.5 ఓవర్లు వేసిన షమీ.. 57 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు.  షమీ ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు.

మొదటిలో ఓపెనర్లను ఔట్‌ చేసి కివీస్‌ను ఒత్తిడిలోకి నెట్టిన షమీ.. అనంతరం సెకెండ్‌ స్పెల్‌లో విలియమ్సన్‌ను ఔట్‌ చేసి మలుపు తిప్పాడు. ఇ​​‍క షమీతో  పాటు బుమ్రా, సిరాజ్‌, కుల్దీప్‌ యాదవ్‌ ఒక్క వికెట్‌ సాధించారు.  

కాగా అంతకుముం‍దు టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 397 పరుగులు సాధించింది. రోహిత్‌ శర్మ(47) సూపర్‌ ఇన్నింగ్స్‌కు తోడు మరో ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ అర్ధ శతకం(80-నాటౌట్‌)తో రాణించాడు.

ఇక విరాట్‌ కోహ్లి(117) రికార్డు సెంచరీతో కివీస్‌ బౌలర్లకు చు​‍క్కలు చూపించగా.. శ్రేయస్‌ అయ్యర్‌(105) తనదైన శైలిలో చెలరేగి శతకం బాదాడు. ఇక న్యూజిలాండ్‌ బౌలర్లలో టిమ్‌ సౌథీకి మూడు, ట్రెంట్‌ బౌల్ట్‌కు ఒక వికెట్‌ దక్కింది. కాగా వరల్డ్‌కప్‌ నాకౌట్స్‌లో తొలిసారి న్యూజిలాండ్‌ను భారత్‌ ఓడించింది. 2019 వరల్డ్‌కప్‌లో సెమీఫైనల్స్‌లో ఓటమికి భారత్‌ బదులు తీర్చుకోంది.
చదవండి: పాకిస్తాన్‌ టీ20 కెప్టెన్‌గా షాహీన్‌ అఫ్రిది.. టెస్టు సారధి ఎవరంటే?

Videos

ప్రతి కార్యకర్త తిరగబడండి.. నిలబడండి.. YSRCP శ్రేణులకు జగన్ పిలుపు

కోలీవుడ్ డైరెక్టర్స్ వైపే చూస్తున్న టాలీవుడ్ టాప్ హీరోస్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

ఆళ్లగడ్డలో ఉద్రిక్తత.. ఇద్దరు ప్రపోజర్లు కిడ్నాప్

దీపావళి తర్వాత మూతపడనున్న పెట్రోల్ బంకులు? కారణం ఇదుకే..!

ప్రొద్దుటూరులో హై టెన్షన్.. రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)