Breaking News

Football: ఫైనల్లో భారత్‌.. పెనాల్టీ షూటౌట్‌లో లెబనాన్‌పై గెలుపు

Published on Sun, 07/02/2023 - 10:10

బెంగళూరు: దక్షిణాసియా ఫుట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌ (శాఫ్‌)లో భారత జట్టు తొమ్మిదో టైటిల్‌కు విజయం దూరంలో నిలిచింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో సునీల్‌ ఛెత్రి కెప్టెన్సీలోని టీమిండియా ‘పెనాల్టీ షూటౌట్‌’లో 4–2తో లెబనాన్‌ జట్టును ఓడించింది. మంగళవారం జరిగే ఫైనల్లో కువైట్‌ జట్టుతో భారత్‌ తలపడుతుంది. మరో సెమీఫైనల్లో కువైట్‌ 1–0తో బంగ్లాదేశ్‌పై గెలిచింది. లెబనాన్‌తో జరిగిన సెమీఫైనల్లో నిర్ణీత సమయం వరకు రెండు జట్లు ఖాతా తెరువలేకపోయాయి. అదనపు సమయంలోనూ గోల్స్‌ నమోదు కాలేదు.

దాంతో విజేతను నిర్ణయించడానికి ‘షూటౌట్‌’ను నిర్వహించారు. ‘షూటౌట్‌’లో భారత్‌ తరఫున వరుసగా సునీల్‌ ఛెత్రి, అన్వర్‌ అలీ, మహేశ్‌ సింగ్, ఉదాంత సింగ్‌ గోల్స్‌ చేశారు. లెబనాన్‌ తరఫున మాతూక్‌ తొలి షాట్‌ను భారత గోల్‌కీపర్‌ గుర్‌ప్రీత్‌ సింగ్‌ సంధూ నిలువరించాడు. ఆ తర్వాత వాలిద్, సాదిక్‌ గోల్స్‌ చేయగా... బదర్‌ కొట్టిన నాలుగో షాట్‌ బయటకు వెళ్లడంతో భారత విజయం ఖరారైంది. గతంలో భారత్‌ 1993, 1997, 1999, 2005, 2009, 2011, 2015, 2021లలో విజేతగా నిలిచింది.   

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)