Breaking News

భారత్‌ జైత్రయాత్ర

Published on Thu, 07/03/2025 - 02:25

చియాంగ్‌ మాయ్‌ (థాయ్‌లాండ్‌): ఆసియా కప్‌–2026 మహిళల ఫుట్‌బాల్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీలో భారత జట్టు ‘హ్యాట్రిక్‌’ నమోదు చేసుకుంది. గత రెండు మ్యాచ్‌ల్లో అద్వితీయ విజయాలు సాధించిన భారత్‌... బుధవారం మూడో మ్యాచ్‌లో 5–0 గోల్స్‌ తేడాతో ఇరాక్‌ను చిత్తుచేసింది. మ్యాచ్‌ ఆరంభం నుంచే సంపూర్ణ ఆధిపత్యం కనబర్చిన టీమిండియా... ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగింది. భారత్‌ తరఫున సంగీత (14వ నిమిషంలో), మనీషా (44వ నిమిషంలో), కార్తీక అంగముత్తు (48వ నిమిషంలో), నిర్మలా దేవి (64వ నిమిషంలో), రతన్‌బాలా దేవి (80వ నిమిషంలో) ఒక్కో గోల్‌ సాధించారు. 

ఓవరాల్‌గా ఈ టోర్నీలో మూడు మ్యాచ్‌లు ఆడిన భారత జట్టు... 22 గోల్స్‌ సాధించి ప్రత్యర్థికి ఒక్కటి కూడా ఇవ్వకపోవడం విశేషం. తొలి మ్యాచ్‌లో 13–0 గోల్స్‌ తేడాతో మంగోలియాను చిత్తుచేసిన టీమిండియా... తిమోర్‌ లెస్టెపై 4–0 గోల్స్‌ తేడాతో నెగ్గింది. తాజా పోరులో సంగీత గోల్‌తో ఖాతా తెరిచిన భారత్‌... మనీషా గోల్‌తో ఆధిక్యాన్ని మరింత పెంచుకుంది. ప్రత్యర్థి నుంచి పెద్దగా ప్రతిఘటన ఎదురుకాకపోవడంతో తొలి అర్ధభాగం ముగిసేసరికి భారత్‌ 2–0తో స్పష్టమైన ఆధిక్యంలో నిలిచింది. ద్వితీయార్ధంలోనూ అదే జోరు కొనసాగిస్తూ మరో మూడు గోల్స్‌ కొట్టి మ్యాచ్‌ను ఏకపక్షం చేసింది. 

గాయం కారణంగా తెలంగాణ అమ్మాయి గుగులోత్‌ సౌమ్య ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేకపోగా... మరింత ఆధిక్యం సాధించే పలు అవకాశాలను మన ప్లేయర్లు సది్వనియోగం చేసుకోలేకపోయారు. గ్రూప్‌ ‘బి’లో భాగంగా ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన భారత్‌ 9 పాయింట్లతో పట్టిక అగ్రస్థానంలో ఉండగా... బుధవారమే జరిగిన మరో మ్యాచ్‌లో 11–0 గోల్స్‌ తేడాతో మంగోలియాపై గెలిచిన థాయ్‌లాండ్‌ కూడా 9 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. థాయ్‌లాండ్‌ కూడా టోర్నీలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలవగా... ఓవరాల్‌గా 22 గోల్సే చేసిన థాయ్‌లాండ్‌ అచ్చం టీమిండియా లాగే ప్రత్యర్థికి ఒక్క గోల్‌ కూడా ఇవ్వలేదు. 

గ్రూప్‌ నుంచి ఒక్క జట్టే ముందంజ వేసే అవకాశం ఉండటంతో... ఇరు జట్ల మధ్య శనివారం జరిగే ఆఖరి గ్రూప్‌ మ్యాచ్‌కు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. చివరిసారి భారత జట్టు 2003లో ఆసియా కప్‌ ప్రధాన టోర్నీలో ఆడింది. ఆ తర్వాత భారత జట్టు ఈ టోర్నీకి అర్హత సాధించలేకపోయింది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)