Breaking News

భారత్‌-బంగ్లా తొలి టీ20.. స్టేడియం వద్ద మూడంచెల భద్రత

Published on Fri, 10/04/2024 - 15:42

బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేసిన టీమిండియా.. ఇప్పుడు టీ20 సిరీస్‌‍ కన్నేసింది. ఆక్టోబర్‌ 6న గ్వాలియర్‌ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్‌ ప్రారంభం కానుంది. ఇప్పటికే గ్వాలియర్‌కు చేరుకున్న ఇరు జట్లు తమ ప్రాక్టీస్‌ను మొదలు పెట్టాయి.

అయితే మొదటి టీ20కు ఇవ్వనున్న గ్వాలియర్ ఇప్పుడు హై సెక్యూరిటీ జోన్‌గా మారింది. న్యూ మాధవరావు సింధియా క్రికెట్ స్టేడియం వద్ద పోలీసులు మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఇరు జట్ల ఆటగాళ్లు బస చేసే హోటల్‌ వద్ద కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు పోలీస్‌ అధికారులు తెలిపారు.

కాగా మ్యాచ్ జరిగే అక్టోబర్ 6న హిందూ మహాసభ బంద్‌కు పిలుపునివ్వడంతో పోలీసులు ముందుస్తు జాగ్రత్తగా భద్రతను కట్టుదిట్టం చేశారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా హిందూ మహాసభ  ఆదివారం నల్లజెండాలతో ర్యాలీని నిర్వహించాలని ప్లాన్‌ చేసింది. దీంతో ఎటువంటి అవాంఛీనయ సంఘటనలు జరగకుండా పోలీసులు అప్రతమత్తమయ్యారు.

తుది జట్లు అంచనా
భారత్‌: అభిషేక్ శర్మ, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్‌), రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్

బంగ్లాదేశ్‌: లిట్టన్ దాస్, తాంజిద్ హసన్ తమీమ్, నజ్ముల్ హుస్సేన్ శాంటో (కెప్టెన్‌), తౌహిద్ హృదయ్, మహ్మదుల్లా, జాకర్ అలీ, మెహిదీ హసన్ మిరాజ్, రిషాద్ హొస్సేన్, ముస్తాఫిజుర్ రెహమాన్, తస్కిన్ అహ్మద్, తంజిమ్ హసన్ సాకిబ్

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)