Breaking News

కరుణ్‌ నాయర్‌పై వేటు

Published on Fri, 09/26/2025 - 01:18

దుబాయ్‌: ఇంగ్లండ్‌ పర్యటనలో మూడు టెస్టులకే పరిమితమైన భారత స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా... స్వదేశంలో వెస్టిండీస్‌తో జరగనున్న రెండు మ్యాచ్‌లకూ అందుబాటులో ఉండనున్నాడు. 2025–27 ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ)లో భాగంగా అక్టోబర్‌ 2 నుంచి టీమిండియా... వెస్టిండీస్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ఆడనుంది. దీని కోసం అజిత్‌ అగార్కర్‌ నేతృత్వంలోని సెలెక్షన్‌ కమిటీ గురువారం 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఎలాంటి సంచలనాలకు తావివ్వకుండా... అంతా ఊహించినట్లే జట్టు ఎంపిక సాగింది. 

దేశవాళీల్లో రాణించి ఇంగ్లండ్‌ టూర్‌కు ఎంపికైన సీనియర్‌ బ్యాటర్‌ కరుణ్‌ నాయర్‌ను ఈ సిరీస్‌కు ఎంపిక చేయలేదు. వచ్చిన అవకాశాలను వినియోగించుకోలేక పోవడంతో అతడిని జట్టు నుంచి తప్పించి దేవదత్‌ పడిక్కల్‌కు అవకాశమిచ్చారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని 25 ఏళ్ల పడిక్కల్‌ను ఎంపిక చేశారు. ఇంగ్లండ్‌  పర్యటనలో 9 ఇన్నింగ్స్‌ల్లో కరుణ్‌ నాయర్‌ ఒక్క అర్ధశతకం మాత్రమే చేసి నిరాశ పరిచాడు. 

రెగ్యులర్‌ వైస్‌ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ గైర్హాజరీలో రవీంద్ర జడేజాకు వైస్‌ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. రిజర్వ్‌ ఓపెనర్, బెంగాల్‌ ఆటగాడు అభిమన్యు ఈశ్వరన్‌ను ఇక ఎంపిక చేయబోమని సెలెక్టర్లు సంకేతాలు పంపారు. గత మూడు నాలుగేళ్లుగా భారత జట్టుతో కలిసి పయనిస్తున్న ఓపెనర్‌ ఈశ్వరన్‌కు ఇక అవకాశాలు రావడం కష్టమే అని అగార్కర్‌ వెల్లడించాడు. వచ్చే ఏడాది కాలంలో భారత జట్టు విదేశాల్లో టెస్టు మ్యాచ్‌లు ఆడేది లేదు. 

స్వదేశంలో మ్యాచ్‌లకు ఓపెనర్లతో పాటు రిజర్వ్‌గా నారాయణ్‌ జగదీశన్‌ అందుబాటులో ఉన్నాడు. దీనిపై అగార్కర్‌ మాట్లాడుతూ... ‘సాధారణంగా విదేశీ పర్యటనలకు 16, 17 మందితో జట్టును ఎంపిక చేస్తారు. అలాంటి సమయంలో రిజర్వ్‌ ఓపెనర్‌ అవసరం ఉంటుంది. ప్రస్తుతం కేఎల్‌ రాహుల్, యశస్వి జైస్వాల్‌ చక్కగా ఆడుతున్నారు. ఈ సమయంలో మూడో ఓపెనర్‌గా ఈశ్వరన్‌ను తీసుకొని అతడిని బెంచ్‌ మీద కూర్చోబెట్టాల్సిన అవసరం లేదు’ అని అన్నాడు. గాయం నుంచి కోలుకున్న ఆంధ్ర ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి జట్టులోకి పునరాగమనం చేశాడు. దక్షిణాఫ్రికాతో సిరీస్‌ వరకు పంత్‌ పూర్తి ఫిట్‌నెస్‌ సాధించే అవకాశాలున్నాయని అగార్కర్‌ తెలిపాడు.  

వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు భారత జట్టు: శుబ్‌మన్‌ గిల్‌ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, కేఎల్‌ రాహుల్, సాయి సుదర్శన్, దేవదత్‌ పడిక్కల్, ధ్రువ్‌ జురేల్‌ (వికెట్‌ కీపర్‌), జడేజా, వాషింగ్టన్‌ సుందర్,  బుమ్రా, అక్షర్, నితీశ్‌ రెడ్డి, జగదీశన్‌ (వికెట్‌ కీపర్‌), సిరాజ్, ప్రసిధ్‌ కృష్ణ, కుల్దీప్‌ యాదవ్‌. 

ఇంగ్లండ్‌ పర్యటన సందర్భంగా కరుణ్‌ నాయర్‌ నుంచి ఇంకా ఎక్కువ ఆశించాం. కానీ అతడు అంచనాలను అందుకోలేకపోయాడు. పడిక్కల్‌ ఇప్పటికే నిరూపించుకున్నాడు. పోటీలో అతడు ముందున్నాడు. మూడో స్థానంలో సాయి సుదర్శన్‌ చక్కటి భరోసా కల్పించాడు. అతడికి మరిన్ని అవకాశాలిస్తాం. వెస్టిండీస్‌తో రెండు మ్యాచ్‌లకు ఇదే జట్టు. ఇంగ్లండ్‌తో చివరి టెస్టు ఆడని బుమ్రాకు ఆ తర్వాత కూడా తగినంత విశ్రాంతి లభించింది. దీంతో అతడు రెండు టెస్టులకు అందుబాటులో ఉంటాడు.  –అజిత్‌ అగార్కర్, చీఫ్‌ సెలెక్టర్‌  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)