Breaking News

12న భారత్, వియత్నాం ఫుట్‌బాల్‌ మ్యాచ్‌

Published on Sun, 10/06/2024 - 04:09

న్యూఢిల్లీ: భారత సీనియర్‌ పురుషుల ఫుట్‌బాల్‌ జట్టు ఈ నెల 12న వియత్నాంతో అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్‌ ఆడనుంది. నిజానికి వియత్నాంలో ఈనెల 7 నుంచి 15 వరకు భారత్‌ ముక్కోణపు టోర్నీలో పాల్గొనాల్సి ఉండగా... మూడో దేశం లెబనాన్‌ టోర్నీ నుంచి తప్పుకుంది. ప్రస్తుతం లెబనాన్‌లోని హెజ్‌»ొల్లా ఉగ్రవాద సంస్థ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ భీకర స్థాయిలో వైమానిక దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో లెబనాన్‌లో గగనతల ప్రయాణం క్లిష్టమైంది. దీంతో లెబనాన్‌ తప్పుకోవాల్సి వచ్చింది. 

ముక్కోణపు టోర్నీ సాధ్యపడకపోవడంతో ఇరు దేశాల ఫుట్‌బాల్‌ సమాఖ్యలు ఫ్రెండ్లీ మ్యాచ్‌ నిర్వహణకు మొగ్గుచూపాయి. ‘లెబనాన్‌ వైదొలగడంతో ముక్కోణపు టోర్నీ రద్దయ్యింది. దీంతో ఆతిథ్య వియత్నాం జట్టుతో భారత సీనియర్‌ జట్టు ఏకైక ఫ్రెండ్లీ మ్యాచ్‌ను ఆడుతుంది’ అని అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్‌) ఒక ప్రకటనలో తెలిపింది.  వియత్నాం రాజధాని హనోయ్‌కి 100 కిలో మీటర్ల దూరంలో ఉన్న తియెన్‌ తువోంగ్‌ స్టేడియంలో ఈ నెల 12న ఇరు జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతుంది. 

అక్కడికి బయలుదేరే ముందు భారత ఫుట్‌బాల్‌ ఆటగాళ్లంతా 5న కోల్‌కతాలో కలుసుకుంటారు. హెడ్‌కోచ్‌ మనొలో మార్కెజ్‌ నేతృత్వంలో 6న ట్రెయినింగ్‌ సెషన్‌లో పాల్గొంటారు. ఆ మరుసటి రోజే కోల్‌కతా నుంచి వియత్నాంకు భారత జట్టు పయనమవుతుంది. ఇదివరకే ఈ మ్యాచ్‌ కోసం 26 మంది సభ్యులతో కూడిన ప్రాబబుల్స్‌ను ప్రకటించారు. వియత్నాం బయలుదేరేముందు తుది 23 సభ్యుల జట్టును ఖరారు చేస్తారు. 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)