Breaking News

సంయుక్త విజేతలుగా భారత్, బంగ్లాదేశ్‌ 

Published on Fri, 02/09/2024 - 03:56

ఢాకా: నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్న దక్షిణాసియా అండర్‌–19 మహిళల ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ ఫైనల్లో భారత్, బంగ్లాదేశ్‌ జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించారు. నిర్ణీత సమయం ముగిసేసరికి రెండు జట్లు 1–1తో సమంగా ముగిశాయి. అనంతరం విజేతను నిర్ణయించడానికి ‘షూటౌట్‌’ నిర్వహించారు.

‘షూటౌట్‌’లో రెండు జట్ల నుంచి గోల్‌కీపర్లతో సహా 11 మంది చొప్పున గోల్స్‌ చేయడంతో 11–11తో సమమైంది. ఈ దశలో ఫలితం తేలేవరకు ‘షూటౌట్‌’ను కొనసాగించాల్సి ఉండగా... టోర్నీ కమిషనర్‌ అనూహ్యంగా రెండు జట్ల కెపె్టన్‌లను పిలిచి, రిఫరీ సమక్షంలో ‘టాస్‌’ ద్వారా విజేతను నిర్ణయించారు.

‘టాస్‌’ నెగ్గడంతో టీమిండియా సంబరాలు చేసుకోగా... బంగ్లాదేశ్‌ బృందం మాత్రం ఈ ఫలితాన్ని నిరసిస్తూ మైదానంలోనే ఉండిపోయింది. గంటన్నర దాటినా వివాదం సద్దుమణగకపోవడంతో నిర్వాహకులు తమ నిర్ణయాన్ని మార్చుకొని చివరకు రెండు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించారు.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)