Breaking News

భారత్ చెత్త రికార్డు.. 92 ఏళ్ల ఇండియన్‌ క్రికెట్‌ హిస్టరీలోనే

Published on Thu, 10/17/2024 - 14:14

బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా బ్యాట‌ర్లు దారుణ ప్ర‌ద‌ర్శన క‌న‌బ‌రిచారు. మొద‌టి ఇన్నింగ్స్‌లో కివీస్‌ బౌల‌ర్ల జోరు ముందు.. భార‌త బ్యాట‌ర్లు చేతులేత్తేశారు. 

బ్లాక్ క్యాప్స్ బౌల‌ర్ల దాటికి టీమిండియా త‌మ తొలి ఇన్నింగ్స్‌లో కేవ‌లం 46 ప‌రుగుల‌కే ఆలౌటైంది. న్యూజిలాండ్ బౌల‌ర్ల‌లో మ్యాట్ హెన్రీ 5 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా..  రౌర్కీ 4 వికెట్లు త‌న ఖాతాలో వేసుకున్నాడు. 

ఇక భార‌త బ్యాట‌ర్ల‌లో రిష‌బ్ పంత్‌(20) ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. భార‌త ఇన్నింగ్స్‌లో అయిదుగురు బ్యాట‌ర్లు డ‌కౌట్ అయ్యారు. కోహ్లి, స‌ర్ఫ‌రాజ్ ఖాన్‌, జ‌డేజా, కేఎల్ రాహుల్‌, అశ్విన్‌.. ఖాతా తెర‌వ‌కుండానే పెవిలియ‌న్‌కు చేరారు. ఇక ఈ మ్యాచ్‌లో కుప్ప‌కూలిన టీమిండియా ప‌లు చెత్త రికార్డుల‌ను త‌మ పేరిట లిఖించుకుంది.

92 ఏళ్ల టెస్టు క్రికెట్‌ చరిత్రలో భార‌త జ‌ట్టుకు స్వ‌దేశంలో ఇదే అత్య‌ల్ప స్కోర్‌. ఇంతకుముందు 1987లో న్యూజిలాండ్‌పై భారత్ 62 పరుగులు చేసింది.

ఓవరాల్‌గా టెస్టుల్లో భారత్‌కు ఇది మూడో అత్యల్ప స్కోర్‌.  గతంలో ఆస్ట్రేలియాపై టీమిండియా 36 పరుగులకు ఆలౌట్ కాగా, లార్డ్స్‌లో ఇంగ్లండ్‌పై 32 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత భారత్ ఇదో లోయస్ట్ టోటల్‌. 
 

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)