Breaking News

INDA Vs ENGA: 5 వికెట్లతో చెలరేగిన భారత స్పిన్నర్‌.. ఇంగ్లండ్‌ చిత్తు

Published on Sat, 01/27/2024 - 16:37

England Lions vs India A, 2nd unofficial Test: ఇంగ్లండ్‌ లయన్స్‌తో అనధికారిక రెండో టెస్టులో భారత-ఏ జట్టు ఘన విజయం సాధించింది. ఇంగ్లిష్‌ యువ జట్టును ఏకంగా ఇన్నింగ్స్‌ 16 పరుగుల తేడాతో మట్టికరిపించింది. సమిష్టి ప్రద​ర్శనతో ఈ సిరీస్‌లో తొలి గెలుపు నమోదు చేసింది.

భారత్‌-ఏ- ఇంగ్లండ్‌ లయన్స్‌ మధ్య మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి అనధికారిక టెస్టు డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అహ్మదాబాద్‌ వేదికగా బుధవారం మొదలైన మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది.

వాళ్లిద్దరి అద్భుత సెంచరీల కారణంగా
భారత బౌలర్ల విజృంభణ కారణంగా 52.4 ఓవర్లలో 152 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. దీంతో తొలి రోజే బ్యాటింగ్‌కు దిగిన ఇండియా-ఏ జట్టు భారీ స్కోరు చేసింది. ఓపెనర్‌, కెప్టెన్‌ అభిమన్యు ఈశ్వరన్‌(58) అర్ధ శతకంతో మెరవగా.. మరో ఓపెనర్‌ దేవ్‌దత్‌ పడిక్కల్‌ సెంచరీ(105)తో సత్తా చాటాడు. తిలక్‌ వర్మ 6 పరుగులకే అవుటై నిరాశ పరచగా.. నాలుగో నంబర్‌లో బ్యాటింగ్‌ చేసిన సర్ఫరాజ్‌ ఖాన్‌ అద్భుత సెంచరీతో చెలరేగాడు.

160 బంతుల్లో 18 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో ఏకంగా 161 పరుగులు రాబట్టాడు. మిగతా వాళ్లలో స్పిన్‌ ఆల్‌రౌండర్లు వాషి​ంగ్టన్‌ సుందర్‌(57), సౌరభ్‌ కుమార్‌(77) అర్ధ శతకాలతో ఆకట్టుకున్నారు. 

నిరాశ పరిచిన తిలక్‌, రింకూ
రింకూ సింగ్‌ మాత్రం డకౌట్‌గా వెనుదిరిగి విమర్శలు మూటగట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో 489 పరుగుల వద్ద యువ భారత్‌ తమ మొదటి ఇన్నింగ్స్‌ ముగించింది. తద్వారా 337 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన 321 పరుగులకే ఆలౌట్‌ అయి ఓటమిని చవిచూసింది.

ఆల్‌రౌండర్‌ సౌరభ్‌ కుమార్‌ ఐదు వికెట్లతో చెలరేగి ఇంగ్లండ్‌ లయన్స్‌ పతనాన్ని శాసించాడు. తన అద్భుత బ్యాటింగ్‌తో ఇంగ్లండ్‌ బౌలర్లకు చుక్కలు చూపించి భారత్‌-ఏ విజయంలో కీలక పాత్ర పోషించిన సర్ఫరాజ్‌ ఖాన్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య ఫిబ్రవరి 1 నుంచి మూడో అనధికారిక టెస్టు ఆరంభం కానుంది.

చదవండి: Ind Vs Eng 1st Test: పాపం జడ్డూ.. ఇది మరీ అన్యాయం!.. అంపైర్‌ను సమర్థించిన రవిశాస్త్రి

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)