Ind vs WI: సిరీస్‌ విజయంపై కన్నేసిన భారత్‌

Published on Tue, 12/17/2024 - 10:53

వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో శుభారంభం చేసిన భారత మహిళల జట్టు.. రెండో గెలుపుపై కన్నేసింది. ఇరు జట్ల మధ్య మంగళవారం జరిగే రెండో టీ20లో గెలిస్తే ఈ సిరీస్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ బృందం  ఖాతాలో చేరుతుంది. మరోవైపు గత మ్యాచ్‌లో ఓటమి నుంచి కోలుకొని మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని విండీస్‌ మహిళలు భావిస్తున్నారు.

ఇక ముంబై వేదికగా తొలి టీ20లో భారత బ్యాటర్లంతా రాణించడం చెప్పుకోదగ్గ సానుకూలాంశం. ఓపెనర్‌ స్మృతి మంధాన దూకుడుగా ఆడి అర్ధసెంచరీ సాధించగా... జెమీమా రోడ్రిగ్స్‌ ఆకాశమే హద్దుగా చెలరేగింది. ముఖ్యంగా ఇటీవల ఆస్ట్రేలియా చేతిలో వన్డేల్లో చిత్తుగా ఓడిన తర్వాత స్వదేశంలో దక్కిన ఈ విజయం జట్టులో ఉత్సాహాన్ని పెంచింది. అయితే ఫీల్డింగ్‌లో టీమ్‌ కాస్త పేలవ ప్రదర్శన కనబర్చింది.

తొలి మ్యాచ్‌లో భారత ఫీల్డర్లు మూడు సునాయాస క్యాచ్‌లు వదిలేశారు. బౌలింగ్‌లో దీప్తి శర్మ చక్కటి బంతులతో ప్రత్యర్థిని కట్టడి చేయగా... టిటాస్‌ సాధు వికెట్లు పడగొట్టింది. ప్రధాన పేసర్‌ రేణుకా సింగ్‌ కూడా సత్తా చాటాల్సి ఉంది. స్వల్ప లోపాలు ఉన్నా... బ్యాటింగ్, బౌలింగ్‌లో సమష్టి ప్రదర్శనతో చెలరేగితే మరో విజయం కష్టం కాబోదు.

మరోవైపు వెస్టిండీస్‌ కూడా బ్యాటింగ్‌లో బలంగానే ఉంది. ముఖ్యంగా డియాండ్రా డాటిన్‌ గత మ్యాచ్‌ తరహాలోనే ధాటిగా ఆడగల సమర్థురాలు. ఖియానా జోసెఫ్‌ కూడా తొలి టీ20లో రాణించింది. వీరితో పాటు కెప్టెన్, ఓపెనర్‌ హేలీ మాథ్యూస్‌ కూడా తన స్థాయికి తగినట్లు ఆడితే విండీస్‌ బలం పెరుగుతుంది.

 

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)