Breaking News

భారత జట్టుకు ఊహించని షాకిచ్చిన బంగ్లాదేశ్‌.. టీ20 సిరీస్‌లో..

Published on Fri, 07/14/2023 - 15:20

India Women tour of Bangladesh, 2023- మిర్పూర్‌: బంగ్లాదేశ్‌ పర్యటనలో భారత మహిళల క్రికెట్‌ జట్టు క్లీన్‌స్వీప్‌ ఆశలకు ఆతిథ్య జట్టు గండికొట్టింది. ఆఖరి టి20లో బంగ్లా ఊహించని షాక్‌ ఇచ్చింది. గురువారం జరిగిన చివరిదైన మూడో మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్‌ బృందం నాలుగు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ చేతిలో బోల్తా పడింది. దీంతో సిరీస్‌ను 3–0 గెలవాలనుకున్న భారత్‌ 2–1తో సరిపెట్టుకుంది.

మొదట భారత్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 102 పరుగులే చేసింది. ఓపెనర్లు స్మృతి మంధాన (1), షఫాలీ వర్మ (11) సహా అందరు మూకుమ్మడిగా విఫలమయ్యారు. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ (40; 3 ఫోర్లు, 1 సిక్స్‌), జెమీమా రోడ్రిగ్స్‌ (28; 4 ఫోర్లు) ఆదుకున్నారు. ప్రత్యర్థి బౌలర్లలో రబియా ఖాన్‌ 3, సుల్తానా 2 వికెట్లు తీశారు. తర్వాత బంగ్లా 18.2 ఓవర్లలో 6 వికెట్లకు 103 పరుగులు చేసి గెలిచింది.

ఓపెనర్‌ షమీమా సుల్తానా (46 బంతుల్లో 42; 3 ఫోర్లు) గెలిపించే బాధ్యత తీసుకుంది. భారత బౌలర్లలో దేవిక వైద్య, మిన్ను మణి చెరో 2 వికెట్లు తీశారు.  ఓవరాల్‌గా మహిళల జట్టుకు బంగ్లా చేతిలో ఇది మూడో ఓటమి. ఈ మూడు మ్యాచ్‌లకూ హర్మన్‌ప్రీత్‌ కౌరే కెపె్టన్‌గా వ్యవహరించింది. ఈ పర్యటనలో తదుపరి మూడు వన్డేల ద్వైపాక్షిక సిరీస్‌ కూడా ఇదే వేదికపై 16న జరిగే తొలి వన్డేతో మొదలవుతుంది.  

చదవండి: Ind Vs WI: ఏరికోరి వచ్చావు! ఏమైందిపుడు? అప్పుడు కూడా ఇలాగే! మార్చుకో..

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)