Breaking News

IND W vs AUS W 3rd T20: సిరీస్‌ ఎవరిదో?

Published on Tue, 01/09/2024 - 06:14

నవీ ముంబై: మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో భారత్, ఆ్రస్టేలియా మహిళా జట్లు చెరొకటి గెలిచి సమఉజ్జీలుగా ఉన్నాయి. ఇప్పుడు సిరీస్‌ను గెలుచుకునేందుకు ఫైనల్‌ లాంటి పోరులో అమీతుమీ తేల్చుకునేందుకు ఇరుజట్లు సిద్ధమయ్యాయి. వన్డే సిరీస్‌లో క్లీన్‌స్వీప్‌ అయిన భారత అమ్మాయిలు ఇప్పుడు టి20 సిరీస్‌ను కోల్పోడానికి సిద్ధంగా లేరు. ఆఖరి పోరులో ఎలాగైనా నెగ్గాలనే లక్ష్యంతో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ బృందం బరిలోకి దిగుతోంది.

తద్వారా కొత్త ఏడాదిలో క్లీన్‌స్వీప్‌ పరాభవాన్ని మరిచేలా ఈ టి20 సిరీస్‌ విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. తొలి మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో నెగ్గినట్లే ఈ ఆఖరి పోరులోనూ దాన్ని పునరావృతం చేస్తే సిరీస్‌ కష్టం కానేకాదు. ముఖ్యంగా టాపార్డర్‌ బ్యాటర్లు బాధ్యతగా ఆడాలి. స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమాలు రాణిస్తే తొలి మ్యాచ్‌ను గెలుచుకున్నంత సులభంగా సిరీస్‌నూ గెలుచుకోవచ్చు.

గత మ్యాచ్‌లో వీరి వైఫల్యమే జట్టును దెబ్బ తీసింది. దీంతో పాటు కెపె్టన్‌ హర్మన్‌ప్రీత్‌ వరుస వైఫల్యాలు జట్టుకు ప్రతికూలంగా మారాయి. ఈ నలుగురు కీలకమైన చివరి మ్యాచ్‌లో రాణిస్తే మాత్రం మన మహిళా జట్టుకు తిరుగుండదు. బౌలింగ్‌లో రేణుక సింగ్, శ్రేయాంక పాటిల్, దీప్తి శర్మ, పూజ వస్త్రకర్‌ నిలకడగా రాణిస్తున్నారు. ఆసీస్‌తో పోల్చుకుంటే భారత ఫీల్డింగ్‌ సాధారణంగా ఉంది. ఈ నేపథ్యంలో జట్టు మేనేజ్‌మెంట్‌కు ఫీల్డింగ్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరముంది.

మరోవైపు ఏకైక టెస్టు మ్యాచ్‌ ఓడాక అలీసా హీలీ నాయకత్వంలోని ఆస్ట్రేలియా జట్టు దెబ్బతిన్న పులిలా వన్డేల్లో పంజా విసిరింది. తాజా టి20 సిరీస్‌లోనూ తొలి మ్యాచ్‌లో చిత్తుగా ఓడినా...    రెండో మ్యాచ్‌లో బదులు తీర్చుకుంది. ఇప్పుడు ఇదే ఉత్సాహంతో భారత గడ్డపై రెండో సిరీస్‌ విజయంపై కన్నేసింది.

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)