Breaking News

తండ్రీ కొడుకులిద్దరిని ఔట్‌ చేసిన తొలి భారత బౌలర్‌గా

Published on Thu, 07/13/2023 - 07:28

టీమిండియా, వెస్టిండీస్‌ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో భారత స్టార్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఒక అరుదైన ఘనత సాధించాడు. ఇదే టెస్టులో రెండు వికెట్లు తీయడం ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో 700 వికెట్లు తీసిన మూడో భారత బౌలర్‌గా చరిత్ర సృష్టించిన అశ్విన్‌ మరో ఘనత కూడా అందుకున్నాడు. మ్యాచ్‌ ద్వారా తండ్రీ కొడుకులిద్దరినీ టెస్టు క్రికెట్‌లో అవుట్‌ చేసిన తొలి భారత బౌలర్‌గా అశ్విన్‌ గుర్తింపు తెచ్చుకున్నాడు.

2011లో తన తొలి టెస్టులో శివ్‌నారాయణ్‌ చందర్‌పాల్‌ వికెట్‌ తీసిన అశ్విన్‌.. తాజాగా తేజ్‌నరైన్‌ చందర్‌పాల్‌ను అవుట్‌ చేశాడు. గతంలో బోథమ్, వసీమ్‌ అక్రమ్, మిచెల్‌ స్టార్క్, సైమన్‌ హార్మర్‌ ఇలాంటి ఫీట్‌ను నమోదు చేశారు. 

ఇయాన్ బోథమ్:లాన్స్ కెయిన్స్‌, క్రిస్ కెయిన్స్‌
వసీం అక్రమ్:లాన్స్ కెయిన్స్‌, క్రిస్ కెయిన్స్‌
మిచెల్ స్టార్క్: శివనరైన్, తేజ్‌నరైన్‌ చందర్‌పాల్‌
సైమన్ హార్మర్:  శివనరైన్, తేజ్‌నరైన్‌ చందర్‌పాల్‌
ఆర్ అశ్విన్:  శివనరైన్, తేజ్‌నరైన్‌ చందర్‌పాల్‌

33వ సారి ఐదు వికెట్ల హాల్‌.. అండర్సన్‌ రికార్డు బద్దలు
ఇక టెస్టు క్రికెట్‌లో అశ్విన్‌ ఒక ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీయడం ఇది 33వ సారి. ఈ క్రమంలో ఇంగ్లండ్‌ స్టార్‌ జేమ్స్‌ అండర్సన్‌ను అధిగమించాడు. అండర్సన్‌ 32 సార్లు ఐదు వికెట్ల హాల్‌ అందుకున్నాడు. ఇక అశ్విన్‌ కంటే ముందు ఐదుగురు బౌలర్లు ఎక్కువసార్లు ఐదు వికెట్ల హాల్‌ను అందుకున్నారు. తొలి స్థానంలో ముత్తయ్య మురళీధరన్‌ 67 సార్లు(133 టెస్టులు), షేన్‌ వార్న్‌ 37 సార్లు(145 మ్యాచ్‌లు), రిచర్డ్‌ హడ్లీ 36 సార్లు(86 మ్యాచ్‌లు), అనిల్‌ కుంబ్లే 35 సార్లు(132 మ్యాచ్‌లు), రంగనా హెరాత్‌ 34 సార్లు( 93 మ్యాచ్‌లు) ఉన్నారు.

చదవండి: అశ్విన్‌ పాంచ్‌ పటాకా.. ఆకట్టుకున్న జైశ్వాల్‌, తొలిరోజు టీమిండియాదే

Videos

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)