Breaking News

Ind vs WI: అశ్విన్‌ అరుదైన ఘనత.. మూడో భారత బౌలర్‌గా చరిత్ర

Published on Thu, 07/13/2023 - 11:26

West Indies vs India, 1st Test: వెస్టిండీస్‌తో తొలి టెస్టు సందర్భంగా టీమిండియా ప్రధాన స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన మూడో భారత బౌలర్‌గా చరిత్రకెక్కాడు. కాగా టీమిండియా ప్రస్తుతం వెస్టిండీస్‌ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో ముందుగా రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా డొమినికా వేదికగా జూలై 12న తొలి మ్యాచ్‌ ఆరంభమైంది. టాస్‌ గెలిచిన ఆతిథ్య జట్టు తొలుత బ్యాటింగ్‌ ఎంచుకోగా భారత స్పిన్నర్‌ అశ్విన్‌ విండీస్‌ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఓపెనర్లు క్రెగ్‌ బ్రాత్‌వైట్‌(20), తేజ్‌నరైన్‌ చందర్‌పాల్‌(12)లను అవుట్‌ చేసి ఆరంభంలోనే షాకిచ్చాడు.

అల్జారీ జోసెఫ్‌ను అవుట్‌ చేయడం ద్వారా
అదే విధంగా.. టెయిలెండర్లు అలిక్‌ అథనాజ్‌(47), అల్జారీ జోసెఫ్‌(4), వారికన్‌(1) వికెట్లు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. మొత్తంగా ఐదు వికెట్లతో రాణించి తొలిరోజు ఆటలో టీమిండియా పైచేయి సాధించేందుకు సహకరించాడు. ఇదిలా ఉంటే.. అల్జారీ జోసెఫ్‌ను అవుట్‌ చేయడం ద్వారా ఇంటర్నేషనల్‌ కెరీర్‌లో అశూ 700వ వికెట్‌ సాధించాడు.

కుంబ్లే, భజ్జీ తర్వాత
తన 271వ మ్యాచ్‌ సందర్భంగా ఈ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. తద్వారా దిగ్గజ స్పిన్నర్‌ అనిల్‌ కుంబ్లే, ఆఫ్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ తర్వాత 700 వికెట్ల క్లబ్‌లో చేరిన మూడో భారత బౌలర్‌గా నిలిచాడు. కాగా కుంబ్లే తన అంతర్జాతీయ కెరీర్‌లో మొత్తంగా 403 మ్యాచ్‌లలో 956 వికెట్లు పడగొట్టి అగ్రస్థానంలో ఉన్నాడు.

16వ స్థానంలో
ఇక భజ్జీ 711 వికెట్లతో రెండో స్థానంలో కొనసాగుతుండగా.. అశూ త్వరలోనే అతడి రికార్డును బద్దలుకొట్టే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో శ్రీలంక స్పిన్‌ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్‌ 1347 వికెట్లతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. ఈ జాబితాలో అశూ(702 వికెట్లు) 16వ స్థానంలో కొనసాగుతున్నాడు.

చదవండి: Ind Vs WI: మనం తప్పు చేశామా అని పశ్చాత్తాపపడేలా చేశాడు! తొలిరోజే 
కోహ్లిని టీజ్‌ చేసిన ఇషాన్‌ కిషన్‌.. వీడియో వైరల్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)