Breaking News

Ind Vs WI: దవడ పగిలినా బౌలింగ్‌ చేసి.. దిగ్గజ బ్యాటర్‌ వికెట్‌ తీసి!

Published on Wed, 07/12/2023 - 17:39

India Tour Of West Indies: అనిల్‌ కుంబ్లే.. ఈ రైట్‌ఆర్మ్‌ లెగ్‌బ్రేక్‌ స్పిన్నర్‌ టీమిండియాకు పలు చిరస్మరణీయ విజయాలు అందించిన ఆటగాళ్లలో ఒకడు. తన సుదీర్ఘ కెరీర్‌లో మేటి జట్లతో ఆడే అవకాశం దక్కించుకున్న ఈ కర్ణాటక బౌలర్‌.. భారత్‌ తరఫున 132 టెస్టులాటి 619 వికెట్లు పడగొట్టాడు. టీమిండియా స్టార్‌ టెస్టు స్పిన్నర్లలో ఒకడిగా నిలిచాడు.

1990లో ఇంగ్లండ్‌తో టెస్టు మ్యాచ్‌ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన కుంబ్లే.. భారత జట్టు సారథిగానూ సేవలు అందించాడు. కెరీర్లో ఎదురైన సవాళ్లంటినీ అధిగమించి మేటి బౌలర్‌గా ఎదిగాడు. ఇక కుంబ్లేకు వెస్టిండీస్‌తో మ్యాచ్‌ అంటే చాలు పూనకాలే! బ్రియన్‌ లారా వంటి దిగ్గజాలను పెవిలియన్‌కు పంపితే ఆ మజానే వేరని భావించేవాడట!

దవడ పగిలినా
దవడ విరిగిపోయినా మైదానం వీడక బౌలింగ్‌ చేయడమే ఇందుకు నిదర్శనం. తాజాగా టీమిండియా వెస్టిండీస్‌ పర్యటన నేపథ్యంలో అనిల్‌ కుంబ్లే 2002 నాటి సంగతులు గుర్తు చేసుకున్నాడు. ఆంటిగ్వా టెస్టు సందర్భంగా మెర్విన్‌ ధిల్లాన్‌ షార్ట్‌ డెలివరీ కారణంగా బంతి బలంగా తాకి అనిల్‌ కుంబ్లే దవడ పగిలింది. దీంతో మ్యాచ్‌కు దూరమవ్వాల్సి పరిస్థితి. విరామ సమయంలో తన భార్య చేతనకు ఫోన్‌ చేసి విషయం చెప్పాడు కుంబ్లే. సర్జరీ కోసం ఇంటికి వస్తున్నానని ఆమెతో అన్నాడు.

కానీ.. ఆ తర్వాత మళ్లీ బౌలింగ్‌ చేసేందుకు మైదానంలోకి దిగాడు.  14 ఓవర్ల పాటు బౌలింగ్‌ చేసి బ్రియన్‌ లారా వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత స్వదేశానికి తిరిగివచ్చాడు. ఈ విషయం గురించి కుంబ్లే జియో సినిమా షోలో మాట్లాడుతూ.. ‘‘నా భార్య చేతనకు కాల్‌ చేసి.. సర్జరీ చేయించుకోవాలి ఇంటికి వస్తున్నా అని చెప్పాను.

జోక్‌ చేస్తున్నా అనుకుంది
అందుకోసం బెంగళూరులో అన్ని ఏర్పాట్లు చేస్తానని తను నాతో అంది. ఇక కాల్‌ కట్‌ చేసే ముందు.. ‘‘నేను వెళ్లి బౌలింగ్‌ చేస్తాను’’అని తనతో అన్నాను. కానీ చేతన నమ్మలేదు. నేను జోక్‌ చేస్తున్నా అనుకుంది’’ అని చెప్పుకొచ్చాడు. ఆరోజు తాను బౌలింగ్‌ కొనసాగించడం తనకు సంతృప్తినిచ్చిందని పేర్కొన్నాడు.

కాగా ఆంటిగ్వా వేదికగా జరిగిన నాలుగో టెస్టు డ్రాగా ముగియగా.. 2002 నాటి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను విండీస్‌ కైవసం చేసుకుంది. ఇదిలా ఉంటే తాజా పర్యటనలో భాగంగా బుధవారం (జూలై 12) నుంచి వెస్టిండీస్‌- టీమిండియా మధ్య టెస్టు సిరీస్‌ ఆరంభం కానుంది. 

చదవండి: రోహిత్‌, కోహ్లి కాదు.. విండీస్‌పై అత్యధిక టెస్టు సెంచరీలు సాధించింది ఇతడే!
జట్టు నుంచి తప్పించడం కంటే కూడా అదే ఎక్కువగా బాధిస్తోంది: టీమిండియా స్టార్‌

Videos

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)