దుమ్ము రేపిన రోహిత్‌ శర్మ.. అయ్యో! సెంచరీ మిస్‌

Published on Tue, 01/10/2023 - 16:18

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కొత్త ఏడాదిని ఘనంగా ఆరంభించాడు. గాయం నుంచి కోలుకుని జట్టులోకి వచ్చిన రోహిత్‌ తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. గౌహతి వేదికగా శ్రీలంకతో తొలి వన్డేలో రోహిత్‌ అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు.

ఈ మ్యాచ్‌లో 67 బంతులు ఎదుర్కొన్న హిట్‌మ్యాన్‌.. 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 83 పరుగులు చేశాడు. కాగా ఆరంభం నుంచే ధాటిగా ఆడిన రోహిత్‌ తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు.

83 పరుగులు చేసిన హిట్‌మ్యాన్‌ శ్రీలంక పేసర్‌ మధుశంక బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ఓ దశలో 150(డాడీ 100)కి పైగా పరుగులు చేస్తాడని భావించగా.. రోహిత్‌ ఇలా సెంచరీ చేజార్చుకోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

ఈ క్రమంలో సోషల్‌ మీడియా వేదికగా.. ‘‘హృదయం ముక్కలైంది’’ అంటూ బ్రేకింగ్‌ హార్ట్‌ ఎమోజీలు జతచేస్తున్నారు. ఇక టీమిండియా మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ సైతం.. ‘‘రోహిత్‌ శర్మ అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు.. కానీ.. డాడీ 100 మిస్‌ అయ్యాడు’’ అని విచారం వ్యక్తం చేశాడు.

భారీ స్కోర్‌ దిశగా భారత్‌
ఇక లంకతో తొలి వన్డేలో భారత్‌ భారీ స్కోర్‌ దిశగా దూసుకుపోతుంది. 41 ఓవర్లు ముగిసే సరికి నాలుగు వికెట్లు కోల్పోయి 303 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో విరాట్‌ కోహ్లి(62), హార్దిక్‌ పాండ్యా(0) పరుగులతో ఉన్నారు. కాగా అంతకుముందు తొలి వికెట్‌కు రోహిత్‌, గిల్‌ కలిసి 143 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ మ్యాచ్‌లో గిల్‌ 70 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు.

Videos

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)