Breaking News

ఇదేం ఆనందం.. బంతిని ఫొటో తీసిన ఫ్యాన్‌! కోహ్లి రియాక్షన్‌ వైరల్‌

Published on Mon, 01/16/2023 - 08:35

తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో 317 పరుగుల తేడాతో భారత్‌ విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 3-0 తేడాతో టీమిండియా క్లీన్‌ స్వీప్‌ చేసింది. అదేవిధంగా వన్డే క్రికెట్‌ చరిత్రలోనే అత్యధిక పరుగుల తేడాతో విజయం సాధించిన జట్టుగా భారత్‌ నిలిచింది.

ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు విరాట్‌ కోహ్లి, శుబ్‌మాన్‌ గిల్‌ అద్భుతమైన సెంచరీలతో చెలరేగారు. కోహ్లి 110 బంతుల్లో 166 నాటౌట్‌ (13 ఫోర్లు, 8 సిక్స్‌లు), గిల్‌ 97 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్స్‌లతో 116 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌తో పాటు సిరీస్‌ అసాంతం రాణించిన కోహ్లికే ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్‌, ప్లేయర్‌ ఆఫ్‌ది సిరీస్‌ అవార్డు దక్కింది.

బంతికి ఫోటో తీసిన ఫ్యాన్‌
కాగా ఈ మ్యాచ్‌లో భారత ఇన్నింగ్స్‌ సందర్భంగా ఓ ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. భారత ఇన్నింగ్స్‌లో 45 ఓవర్‌ వేసిన కరుణరత్నే బౌలింగ్‌లో తొలి బంతిని కోహ్లి లాంగ్‌ ఆన్‌ దిశగా స్టాండ్స్‌కు తరిలించాడు. ఈ క్రమంలో స్టాండ్స్‌లో ఉన్న అభిమాని బంతిని అందుకున్నాడు.

అయితే ఆ ఫ్యాన్‌ బంతిని తిరిగివ్వకుండా ఫోటో తీసుకుంటూ ఉండి పోయాడు. దీంతో తరువాతి బంతిని ఎదుర్కొవడానికి సిద్దంగా ఉన్న కోహ్లి.. అభిమాని చర్యను చూసి నవ్వుకున్నాడు. ఆ తర్వాత కాసేపటికి అతడు బంతిని తిరిగి అందించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండిIND vs SL: ధోనిని గుర్తు చేసిన కోహ్లి.. హెలికాప్టర్‌ షాట్‌తో భారీ సిక్స్‌! వీడియో వైరల్‌

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)