Breaking News

Ind Vs SL: ఇదెలా సాధ్యమైంది? కోహ్లి షాకింగ్‌ ఎక్స్‌ప్రెషన్‌.. వైరల్‌

Published on Thu, 01/12/2023 - 17:10

Virat Kohli Goes Dumbstruck: టీమిండియాతో రెండో వన్డేలో శ్రీలంక బ్యాటర్‌ కుశాల్‌ మెండిస్‌ ఫర్వాలేదనిపించాడు. గత మ్యాచ్‌లో సిరాజ్‌ బౌలింగ్‌లో డకౌట్‌ అయిన ఈ వికెట్‌ కీపర్.. కోల్‌కతా మ్యాచ్‌లో 34 పరుగులు చేయగలిగాడు. అయితే, 18 ఓవర్‌ మొదటి బంతికి టీమిండియా చైనామన్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ చేతికి చిక్కి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 

ఇక ఈడెన్‌ గార్డెన్స్‌ మ్యాచ్‌లో మొత్తంగా 34 బంతులు ఎదుర్కొన్న మెండిస్‌ 34 పరుగులు(3 ఫోర్లు, ఒక సిక్స్‌ సాయంతో)చేశాడు. అయితే, టీమిండియా పేస్‌ యువ సంచలనం ఉమ్రాన్‌ మాలిక్‌ బౌలింగ్‌లో అతడు కొట్టిన ఏకైక సిక్సర్ హైలైట్‌గా నిలిచింది. లంక ఇన్నింగ్స్‌లో 16 ఓవర్‌ ఉమ్రాన్‌ వేశాడు.

వారెవ్వా! కోహ్లి షాక్‌!
ఈ క్రమంలో మూడో బంతిని అద్భుత రీతిలో మెండిస్‌ సిక్స్‌గా మలిచాడు. ఉమ్రాన్‌ సంధించిన షార్ట్‌ బాల్‌ను డీప్‌ ఫైన్‌ లెగ్‌ మీదుగా షాట్‌ బాదాడు. ఇక మెండిస్‌ కొట్టిన సిక్స్‌ చూసి టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లి ఆశ్చర్యపోయాడు. ‘ఇదెలా సాధ్యమైందిరా బాబు’ అన్నట్లుగా నోటికి చెయ్యి అడ్డుపెట్టుకుని.. షాకింగ్‌ ఎక్స్‌ప్రెషన్‌ ఇచ్చాడు.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కాగా అరంగేట్ర ఓపెనర్‌ నువానీడు ఫెర్నాండో(50), మెండిస్‌(34) మినహా మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేదు. దీంతో లంక 215 పరుగులకే ఆలౌట్‌ అయింది. రెండో వన్డేలో శ్రీలంకను తక్కువ స్కోరుకే కట్టడి చేసిన రోహిత్‌ సేన.. సిరీస్‌ విజయమే లక్ష్యంగా ఛేదనకు దిగనుంది. ఇక ఇప్పటికే గువహటి మ్యాచ్‌లో భారీ విజయం సాధించి ఆతిథ్య భారత్‌ 1-0తో సిరీస్‌లో ముందంజలో ఉన్న సంగతి తెలిసిందే.

చదవండి: IND vs SL: లంక యువ సంచలనం.. అరంగేట్రంలోనే అదుర్స్‌! కానీ పాపం..
IPL 2023: ముంబై ఇండియన్స్‌ ఓపెనర్‌గా 'బేబీ ఏబీడీ'.. మరి రోహిత్‌?

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)