రోహిత్‌.. లంకపై చేసిన హాఫ్‌ సెంచరీని ఎవరికి అంకితం ఇచ్చాడో తెలుసా..?

Published on Tue, 01/10/2023 - 19:19

గౌహతి వేదికగా శ్రీలం‍కతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మెరుపు హాఫ్‌ సెంచరీతో విరుచుకుపడిన విషయం తెలిసిం‍దే. చాలాకాలం తర్వాత మునపటి టచ్‌లో కనబడిన హిట్‌ మ్యాన్‌.. 41 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఓవరాల్‌గా  67 బంతులు ఎదుర్కొన్న టీమిండియా కెప్టెన్‌.. 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 83 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్‌ ఆరంభం నుంచే ధాటిగా ఆడిన రోహిత్‌ తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. మధుశంక బౌలింగ్‌లో బంతి ఇన్‌ సైడ్‌ ఎడ్జ్‌ తీసుకోవడంతో రోహిత్‌ క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. 

కాగా, ఈ మ్యాచ్‌లో రోహిత్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాక ఆకాశం వైపు చూస్తూ భావోద్వేగానికి లోనయ్యాడు. ఎందుకంటే.. నిన్న (జనవరి 9) రోహిత్‌ అల్లారు ముద్దుగా పెంచుకున్న పెంపుడు కుక్క మ్యాజిక్‌ చనిపోయింది. ఈ విషయాన్ని రోహిత్‌ భార్య రితిక తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా వెల్లడించింది. మ్యాజిక్‌ లేదన్న బాధలోనే ఈ మ్యాచ్‌ బరిలోకి దిగిన రోహిత్‌.. ఫిఫ్టి పూర్తి కాగానే ఆకాశం వైపు చూస్తూ మ్యాజిక్‌ పేరును స్మరిస్తూ, చాలాకాలం తర్వాత చేసిన కీలక హాఫ్‌ సెంచరీని మ్యాజిక్‌కు అంకితమిచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. 

ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో రోహిత్‌, శుభ్‌మన్‌ గిల్‌ (70)లు హాఫ్‌ సెంచరీలతో రాణించగా, మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (87 బంతుల్లో 113; 12 ఫోర్లు, సిక్స్‌) శతకంతో విరుచుకుపడ్డాడు. ఫలితంగా టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 373 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. లంక బౌలర్లలో కసున్‌ రజిత 3 వికెట్లు పడగొట్టగా.. మధుశంక, కరుణరత్నే, షనక, ధనంజయ డిసిల్వ తలో వికెట్‌ దక్కించుకున్నారు.  


 

Videos

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)