ముగిసిన తొలి రోజు ఆట.. సఫారీలదే పై చేయి

Published on Sat, 11/22/2025 - 16:32

గువ‌హ‌టి వేదిక‌గా భార‌త్‌తో జ‌రుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఆట‌లో సౌతాఫ్రికా పై చేయి సాధించింది. మొద‌టి రోజు ఆట ముగిసే స‌మ‌యానికి ద‌క్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల న‌ష్టానికి 247 పరుగులు చేసింది.  ప్రస్తుతం క్రీజులో ముత్తుసామి (25*), వెర్రిన్ (1*) ఉన్నారు. 

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ప్రోటీస్ జ‌ట్టుకు ఓపెనర్లు మార్క్రమ్ (38), రికెల్టన్ (35) శుభారంభాన్ని అందించారు. బ్యాటర్లకు అనుకూలంగా ఉండే విధంగా పిచ్ తయారు చేయడంతో తొలి వికెట్‌ను సాధించేందుకు భార‌త బౌల‌ర్లు తీవ్రంగా శ్ర‌మించారు.

జ‌స్ప్రీత్ బుమ్రా అద్భుత‌మైన బంతితో మార్‌క్ర‌మ్‌ను ఔట్ చేయ‌డంతో భార‌త్‌కు తొలి వికెట్ ల‌భించింది. అనంత‌రం ట్రిస్టన్ స్టబ్స్ (49), కెప్టెన్ టెంబా బవుమా (41) నిలకడగా ఆడి ఇన్నింగ్స్‌ను నడిపించారు. అయితే రెండో సెష‌న్‌లో మాత్రం భార‌త బౌల‌ర్లు పుంజుకున్నారు.

ముఖ్యంగా స్పిన్నర్లు కీలక వికెట్లు పడగొట్టారు. రికెల్టన్, స్టబ్స్, ముల్డర్‌ల‌ను కుల్దీప్ యాద‌వ్ పెవిలియ‌న్‌కు పంప‌గా.. బ‌వుమాను జ‌డ్డూ బోల్తా కొట్టించాడు. భార‌త బౌల‌ర్ల‌లో ఇప్ప‌టివ‌ర‌కు కుల్దీప్ యాద‌వ్ మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్, జడేజా తలో వికెట్ దక్కించుకున్నారు.
చదవండి: IPL 2026: ముంబై ఇండియన్స్‌ మాస్టర్‌ ప్లాన్‌.. అర్జున్‌ స్ధానంలో?
 

Videos

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)