Breaking News

అశ్విన్‌ ఆల్‌టైమ్‌ రికార్డుపై కన్నేసిన మిస్టరీ స్పిన్నర్‌

Published on Wed, 11/13/2024 - 19:13

టీమిండియా మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి సహచర స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ పేరిట ఉన్న ఓ ఆల్‌టైమ్‌ రికార్డుపై కన్నేశాడు. సౌతాఫ్రికాతో ఇవాళ (నవంబర్‌ 13) జరుగబోయే మూడో టీ20లో వరుణ్‌ మరో రెండు వికెట్లు తీస్తే.. టీమిండియా తరఫున ఓ ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్‌గా రికార్డు సృష్టిస్తాడు.

2016లో శ్రీలంకతో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో అశ్విన్‌ 9 వికెట్లు తీశాడు. నాటి నుంచి ఓ ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో ఏ భారత స్పిన్నర్‌ ఇన్ని వికెట్లు తీయలేదు. ఇప్పుడు అశ్విన్‌ ఆల్‌టైమ్‌ రికార్డును బద్దలు కొట్టే అవకాశం వరుణ్‌కు వచ్చింది. ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో వరుణ్‌ ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో  5.25 సగటున 8 వికెట్లు తీశాడు.

డర్బన్‌ వేదికగా జరిగిన తొలి టీ20లో మూడు వికెట్లు తీసిన వరుణ్‌.. గెబెర్హా వేదికగా జరిగిన రెండో టీ20లో ఐదు వికెట్లు పడగొట్టాడు. సెంచూరియన్‌ వేదికగా ఇవాళ మూడో టీ20 జరుగనుంది. భారతకాలమానం ప్రకారం​ ఈ మ్యాచ్‌ రాత్రి 8:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగనున్నాయి. తొలి టీ20లో భారత్‌ గెలువగా.. రెండో టీ20లో సౌతాఫ్రికా గెలిచిన విషయం తెలిసిం​దే.

రెండో టీ20లో టీమిండియా తొలుత బ్యాటింగ్‌ చేసి 124 పరుగులకే పరిమితమైనా.. వరుణ్‌ చక్రవర్తి అద్భుతంగా బౌలింగ్‌ చేసి విజయావకాశాలు సృష్టించాడు. అయితే ఆఖర్లో కొయెట్జీ, స్టబ్స్‌ కొన్ని అద్భుతమైన షాట్లు ఆడి టీమిండియాకు గెలుపును దూరం చేశారు. ఈ మ్యాచ్‌లో వరుణ్‌ డేంజరెస్‌ బ్యాటర్లైన రీజా హెండ్రిక్స్‌, ఎయిడెన్‌ మార్క్రమ్‌, మార్కో జన్సెన్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌, డేవిడ్‌ మిల్లర్‌ వికెట్లు పడగొట్టాడు.

 

 

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి