Breaking News

భారత్‌తో వన్డేలో శతక్కొట్టిన ఓపెనర్లు.. సౌతాఫ్రికా భారీ స్కోరు

Published on Wed, 11/19/2025 - 13:36

భారత్‌తో మూడో అనధికారిక వన్డేలో సౌతాఫ్రికా- ‘ఎ’ జట్టు (IND A vs SA A) భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు శతక్కొట్టడంతో నిర్ణీత యాభై ఓవర్లలో ఏకంగా 325 పరుగులు చేసింది. కాగా రెండు అనధికారిక టెస్టులు, మూడు అనధికారిక వన్డేలు ఆడేందుకు సౌతాఫ్రికా- ‘ఎ’ జట్టు భారత్‌లో పర్యటిస్తోంది.

ఇందులో భాగంగా భారత్‌-‘ఎ’ జట్టుతో అనధికారిక టెస్టు సిరీస్‌ను 1-1తో సమం చేసిన సఫారీ జట్టు.. వన్డే సిరీస్‌ను మాత్రం కోల్పోయింది. తొలి, రెండో వన్డేలో తిలక్‌ వర్మ సేన చేతిలో ఓటమిపాలైంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య రాజ్‌కోట్‌ వేదికగా బుధవారం నాటి నామమాత్రపు మూడో వన్డేలో మాత్రం సౌతాఫ్రికా- ‘ఎ’ జట్టు బ్యాటింగ్‌తో అదరగొట్టింది.

శతక్కొట్టిన ఓపెనర్లు
ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత్‌-‘ఎ’ జట్టు ప్రొటిస్‌ టీమ్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఓపెనర్లు లువాన్‌ డ్రి ప్రిటోరియస్‌, రివాల్డో మూన్‌సామీ ఆకాశమే హద్దుగా చెలరేగారు. ప్రిటోరియస్‌ 98 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో ఏకంగా 123 పరుగులు చేయగా.. మూన్‌సామీ 130 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, రెండు సిక్సర్లు బాది 107 పరుగులు సాధించాడు.

మిగతా అంతా ఫెయిల్‌
విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిన ఈ ఓపెనింగ్‌ జోడీని భారత పేసర్‌ ప్రసిద్‌ కృష్ణ విడదీశాడు. దీంతో సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌ నెమ్మదించింది. మిగతా వాళ్లంతా పెలివియన్‌కు క్యూ కట్టారు. రుబిన్‌ హెర్మాన్‌ (11), సినెతెంబ కెషిలె (1), కెప్టెన్‌ మార్క్వెస్‌ అకెర్మాన్‌ (16) పూర్తిగా విఫలం కాగా.. డియాన్‌ ఫోరెస్టర్‌ 20, డిలానో పాట్‌గిటర్‌ 30 (నాటౌట్‌) ఫర్వాలేదనిపించారు. డిజోర్న్‌ ఫార్చ్యూన్‌ 2 పరుగులతో అజేయంగా నిలిచాడు.

ఫలితంగా సౌతాఫ్రికా-‘ఎ’ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 325 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత బౌలర్లలో పేసర్లు ప్రసిద్‌ కృష్ణ, ఖలీల్‌ అహ్మద్‌, హర్షిత్‌ రాణా తలా రెండేసి వికెట్లు కూల్చారు.

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)