Breaking News

IND VS SA 3rd ODI: సంజూ సెంచరీ.. బట్లర్‌ ఏం చేశాడో చూడండి..!

Published on Thu, 12/21/2023 - 21:17

ఇంగ్లండ్‌ పరిమత ఓవర్ల జట్టు కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ తన ఐపీఎల్‌ జట్టు (రాజస్థాన్‌ రాయల్స్‌) సారధి సంజూ శాంసన్‌పై ఉన్న ప్రేమను ప్రత్యేకంగా చాటుకున్నాడు. సౌతాఫ్రికాతో ఇవాళ (డిసెంబర్‌ 21) జరుగుతున్న మూడో వన్డేలో సంజూ సెంచరీ (108) సాధించగా.. బట్లర్‌ తన కెప్టెన్‌ సాధించిన ఘనతను, అలాగే మరో రాయల్‌ (చహల్‌) కెప్టెన్‌ను అభినందిస్తున్న దృశ్యాన్ని తన ఇన్‌స్టా స్టోరీగా పోస్ట్‌ చేశాడు. బట్లర్‌ ఈ పోస్ట్‌ చేసిన నిమిషాల వ్యవధిలోనే వైరల్‌గా మారింది.

బట్లర్‌.. తన ఐపీఎల్‌ సహచరుడు సాధించిన ఘనతను సెలబ్రేట్‌ చేసుకోవడంపై భారత క్రికెట్‌ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సంజూతో సమానంగా బట్లర్‌ను కూడా అభినందనలతో ముంచెత్తుతున్నారు. రాయల్స్‌కు తమ కెప్టెన్‌పై ఉన్న ప్రత్యేకమైన అభిమానానికి ఫిదా అవుతున్నారు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. సిరీస్‌ డిసైడర్‌లో క్లిష్టమైన పిచ్‌పై జట్టు కషాల్లో (49/2) ఉన్నప్పుడు క్రీజ్‌లోకి వచ్చిన సంజూ.. తన కెరీర్‌లో అత్యుత్తమ ఇన్నింగ్స్‌ ఆడి టీమిండియాకు భారీ స్కోర్‌ను అందించాడు. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా సంజూ శతక్కొట్టడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. సంజూతో పాటు తిలక్‌ వర్మ (52) కూడా బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆఖర్లో రింకూ సింగ్‌ (38) తనదైన స్టయిల్‌లో మెరుపులు మెరిపించాడు.

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు