నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా
Breaking News
ఇస్రో: జీఎస్ఎల్వీ-ఎఫ్17 సక్సెస్.. నింగిలోకి ‘నిఘా నేత్రం’
చరిత్ర సృష్టించిన భారత ఓపెనర్.. ప్రపంచ రికార్డులు
ఒక్క పోటుతో.. చిన్నారెడ్డి ఫస్ట్ రియాక్షన్
సురేఖ బర్తరఫ్.. కొండా మురళి సంచలన ట్వీట్
ప్రపంచ వ్యాప్తంగా నిలిచిపోయిన చాట్‌జీపీటీ, జెమిని ఏఐ
మోదీకి ఆ కానుక ఇవ్వాలనుకున్నా.. కానీ ఏమైందంటే?
శ్రీకాంత్ అద్భుత విజయం.. సుదీర్ఘ నిరీక్షణకు తెర
హైదరాబాద్‌లో ట్రాఫిక్ మళ్లింపులు.. ఈ రూట్లలో వెళ్తున్నారా?
వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన చంద్రబాబు
అగార్కర్ అందుకే రాలేదు.. రోహిత్ గురించి ఎందుకు?: బీసీసీఐ
‘బీజేపీ నేతలు సమాధానం చెప్పాల్సిందే’
రేవంత్‌రెడ్డిని శపిస్తున్నాను: కొండా సుస్మిత సంచలనం
తెలంగాణ సీఈఓ సుదర్శన్‌రెడ్డికి ‘సర్’ నోటీసులు
మీసం మెలేసిన కొండా మురళి
స్త్రీవాద దిగ్గజం, ప్రముఖ జర్నలిస్టు, రచయిత్రి కన్నుమూత
గతంలోనూ మంత్రులు బర్తరఫ్.. ఎవరెవరు? ఎప్పుడెప్పుడంటే?
తెలంగాణ రాజకీయాల్లో నెక్ట్స్ ఏంటి?
కొండా సురేఖ వివాదం.. ఎలా మొదలైంది? ఎప్పుడేం జరిగింది?
స్కార్పియోని రూఫ్‌టాప్ ఎక్కించాడు? ఎందుకో తెలుసా?
రూ. 1,200 కోట్లతో వందేళ్లు నిలిచేలా కొత్త సెక్రటేరియట్
భారత్-సౌతాఫ్రికా రెండో టెస్ట్ విశేషాలు, రికార్డులు..
Published on Thu, 01/04/2024 - 18:44
కేప్‌టౌన్ వేదికగా భారత్-సౌతాఫ్రికా జట్ల మధ్య జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ పలు రికార్డులకు వేదికైంది. ఈ మ్యాచ్‌లో భారత్.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసుకుంది. దీనికి ముందు సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.
కేప్‌టౌన్ టెస్ట్ రికార్డులు..
- 2024లో తొలి టెస్ట్
- కేవలం ఒకటిన్నర రోజుల్లో ముగిసింది (నాలుగున్నర సెషన్లు)
- భారత్.. సౌతాఫ్రికాను కేప్‌టౌన్‌లో తొలిసారి ఓడించింది
- కేప్‌టౌన్‌లో టెస్ట్ మ్యాచ్ గెలిచిన తొలి ఏషియన్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ రికార్డు
- కేప్‌టౌన్‌లో టెస్ట్ మ్యాచ్ గెలిచిన తొలి ఏషియన్ జట్టుగా భారత్ రికార్డు
- ధోని తర్వాత సౌతాఫ్రికా గడ్డపై టెస్ట్ సిరీస్‌ను డ్రా చేసుకున్న రెండో కెప్టెన్‌గా హిట్‌మ్యాన్ రికార్డు
- అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీఎంట్రీ తర్వాత టెస్ట్‌ల్లో సౌతాఫ్రికా అత్యల్ప స్కోర్ (55, తొలి ఇన్నింగ్స్)
- టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఓ జట్టు (భారత్) పరుగులేమీ (153 పరుగుల వద్ద) చేయకుండా తమ చివరి ఆరు వికెట్లు కోల్పోవడం ఇదే తొలిసారి.
- 2024లో తొలి సెంచరీ చేసిన ఆటగాడిగా మార్క్రమ్ రికార్డు
- టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా (బంతుల పరంగా) ముగిసిన టెస్ట్ మ్యాచ్ (642 బంతుల్లో)
- టెస్టు క్రికెట్ చరిత్రలోనే తొలి రోజు అత్యధిక వికెట్లు (23) పడిన రెండో మ్యాచ్‌గా రికార్డు.
మ్యాచ్ విశేషాలు..
- సిరాజ్ చెలరేగడంతో (6/15) తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 55 పరుగులకే కుప్పకూలింది
- ఒకే స్కోర్ వద్ద (153, తొలి ఇన్నింగ్స్) టీమిండియా చివరి ఆరు వికెట్లు కోల్పోయింది.
- కెరీర్‌లో తొమ్మిదో ఐదు వికెట్ల ప్రదర్శనతో (6/61) సౌతాఫ్రికా నడ్డివిరిచిన బుమ్రా
- సౌతాఫ్రికా తరఫున టెస్ట్‌ల్లో అత్యంత వేగవంతమైన ఆరో సెంచరీ (99 బంతుల్లో) చేసిన మార్క్రమ్
- సౌతాఫ్రికా తరఫున ఓ పూర్తయిన టెస్ట్ ఇన్నింగ్స్‌లో అత్యధిక శాతం (60.22) పరుగులు చేసిన ఆటగాడిగా మార్క్రమ్ రికార్డు
- సౌతాఫ్రికా తాత్కలిక కెప్టెన్ డీన్ ఎల్గర్ టెస్ట్ కెరీర్ ముగిసింది
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్-సిరాజ్
ప్లేయర్ ఆఫ్ ది సిరీస్- డీన్ ఎల్గర్, బుమ్రా
స్కోర్ వివరాలు..
సౌతాఫ్రికా- 55 (వెర్రిన్ 15, సిరాజ్ 6/15), 176 (మార్క్రమ్ 106, బుమ్రా 6/61)
భారత్- 153 (కోహ్లి 46, ఎంగిడి 3/30), 80/3 (జైస్వాల్ 28, జన్సెన్ 1/15)
7 వికెట్ల తేడాతో భారత్ విజయం
#
Tags : 1