Breaking News

హార్దిక్‌ విధ్వంసం.. సౌతాఫ్రికా టార్గెట్‌ ఎంతంటే..?

Published on Tue, 12/09/2025 - 20:47

ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా కటక్‌లోని బారాబతి స్టేడియం వేదికగా సౌతాఫ్రికాతో ఇవాళ (డిసెంబర్‌ 9) జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా ఓ మోస్తరుకు మించి భారీ స్కోర్‌ చేసింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌.. ఇన్నింగ్స్‌ మధ్య వరకు తడబడినప్పటికీ హార్దిక్‌ రాకతో పరిస్థితి ఒక్కసారిగా మారింది.

తొలి బంతి నుంచే ఎదురుదాడి మొదలుపెట్టిన హార్దిక్‌ ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాది స్కోర్‌ వేగాన్ని పెంచాడు. అతనికి మరో ఎండ్‌ నుంచి సహకారం లేనప్పటికీ ఒంటరి పోరాటం చేశాడు. 28 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయమైన 59 పరుగులు చేశాడు.

ఫలితంగా భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్‌లో అభిషేక్‌ శర్మ 17, శుభ్‌మన్‌ గిల్‌ 4, సూర్యకుమార్‌ యాదవ్‌ 12, తిలక్‌ వర్మ 26, అక్షర్‌ పటేల్‌ 23, శివమ్‌ దూబే 11, జితేశ్‌ శర్మ 10 (నాటౌట్‌) పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో ఎంగిడి 3 వికెట్లు తీయగా.. సిపాంమ్లా 2, ఫెరియెరా ఓ వికెట్‌ పడగొట్టాడు.

తుది జట్లు..
భారత్‌: అభిషేక్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌, తిలక్‌ వర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌), హార్దిక్‌ పాండ్యా, శివమ్‌ దూబే, జితేశ్‌ శర్మ (వికెట్‌కీపర్‌),అక్షర్‌ పటేల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, వరుణ్‌ చక్రవర్తి, జస్‌ప్రీత్‌ బుమ్రా.

సౌతాఫ్రికా: క్వింటన్ డికాక్ (వికెట్‌కీపర్‌), ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్‌), డెవాల్డ్ బ్రీవిస్, ట్రిస్టన్ స్టబ్స్, డొనొవన్‌ ఫెరియెరా, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, లుథో సిపంమ్లా, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్జే
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)