IND vs SA: టాస్‌ గెలిచిన సౌతాఫ్రికా.. రుతురాజ్‌కు చోటు.. పంత్‌కు నో ఛాన్స్‌

Published on Sun, 11/30/2025 - 13:01

టీమిండియాతో తొలి వన్డేలో సౌతాఫ్రికా టాస్‌ గెలిచింది. రాంచి వేదికగా తాము తొలుత ఫీల్డింగ్‌ చేయనున్నట్లు ప్రొటిస్‌ జట్టు తాత్కాలిక కెప్టెన్‌ ఐడెన్‌ మార్క్రమ్‌ తెలిపాడు. వికెట్‌ పాతబడుతున్న కొద్ది బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందని.. రాత్రివేళ మంచు ప్రభావం కూడా ఉంటుంది కాబట్టి తాము తొలుత బౌలింగ్‌ చేయాలనుకుంటున్నట్లు వెల్లడించాడు.

ఇక రాంచి వన్డేలో తాము ఒకే ఒక్క స్పిన్నర్‌తో బరిలోకి దిగుతున్నట్లు మార్క్రమ్‌ తెలిపాడు. సుబ్రేయన్‌తో పాటు తాను కూడా పార్ట్‌టైమ్‌ బౌలింగ్‌ చేస్తానని పేర్కొన్నాడు. కెప్టెన్‌ తెంబా బవుమాతో పాటు కేశవ్‌ మహరాజ్‌కు విశ్రాంతినిచ్చామన్న మార్క్రమ్‌.. నలుగురు సీమర్లను ఆడించనున్నట్లు వెల్లడించాడు.

ముగ్గురు స్పిన్నర్లతో భారత్‌
మరోవైపు.. శుబ్‌మన్‌ గిల్‌ గైర్హాజరీలో టీమిండియాకు సారథ్యం వహిస్తున్న కేఎల్‌ రాహుల్‌ మాట్లాడుతూ.. టాస్‌ గెలిస్తే తాము కూడా తొలుత బౌలింగే చేసేవాళ్లమని పేర్కొన్నాడు. మధ్య ఓవర్లలో నిలబడటం కీలకమని... తాము మ్యాచ్‌కు పూర్తి స్థాయిలో సన్నద్ధమైనట్లు తెలిపాడు. 

పటిష్ట జట్టుతో పోటీపడటం తమకు సవాలు లాంటిదని.. అనుకూల ఫలితం రాబట్టేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తామన్నాడు. తమ తుదిజట్టులో ముగ్గురు స్పిన్నర్లకు చోటు ఇచ్చినట్లు కేఎల్‌ రాహుల్‌ ఈ సందర్భంగా తెలిపాడు.

టీమిండియా వర్సెస్‌ సౌతాఫ్రికా తొలి వన్డే తుదిజట్లు ఇవే
టీమిండియా
రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, రుతురాజ్ గైక్వాడ్, వాషింగ్టన్ సుందర్, కేఎల్‌ రాహుల్(కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్‌ సింగ్, ప్రసిద్‌ కృష్ణ.

సౌతాఫ్రికా
ర్యాన్ రికెల్టన్, క్వింటన్ డి కాక్(వికెట్‌ కీపర్‌), ఐడెన్ మార్క్రమ్‌ (కెప్టెన్‌), మాథ్యూ బ్రీట్జ్కే, టోనీ డి జోర్జి, డెవాల్డ్ బ్రెవిస్, మార్కో యాన్సెన్, కార్బిన్ బాష్, ప్రెనేలన్ సుబ్రేయన్, నండ్రీ బర్గర్, ఒట్నీల్ బార్ట్‌మాన్.

 

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)