Breaking News

రబాడ బౌన్సర్ల వర్షం.. అయినా గానీ! శెభాష్‌ రాహుల్‌

Published on Tue, 12/26/2023 - 20:13

టీమిండియా బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ మరోసారి తన క్లాస్‌ను చూపించాడు. సెంచూరియన్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో రాహుల్‌ అద్బుతమైన పోరాట పటిమ కనబరిచాడు. బ్యాటింగ్‌కు కష్టంగా ఉన్న వికెట్‌పై రాహుల్‌ హాఫ్‌ సెంచరీతో చెలరేగాడు. మొదటి ఇన్నింగ్స్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన రాహుల్‌.. సఫారీ పేసర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు. ఓ వైపు దక్షిణాఫ్రికా బౌలర్లు బౌన్సర్ల వర్షం కురిపిస్తునప్పటికీ రాహుల్‌ మాత్రం ఎక్కడ కూడా వెనక్కి తగ్గలేదు.

తొలి రోజు ఆట ముగిసే సమయానికి రాహుల్‌ 105 బంతుల్లో 70 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఇప్పటివరకు 10 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి. భారత్‌ స్కోర్‌ 200 పరుగుల మార్క్‌ దాటడంలో రాహుల్‌ది కీలక పాత్ర. సౌతాఫ్రికాపై రాహుల్‌కు ఇది 2వ హాఫ్‌ సెంచరీ. ఓవరాల్‌గా 14వ ఆర్ధ సెంచరీ కావడం గమానార్హం. ఈ  ఇన్నింగ్స్‌ మాత్రం రాహుల్‌కు తన కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అతడి ఇన్నింగ్స్‌లో అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

వర్షం అంతరాయం..
ఈ తొలి రోజు మూడో సెషన్‌లో ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. సెంచూరియన్‌ వేదికగా జరుగుతున్న భారత్‌-దక్షిణాఫ్రికా తొలి టెస్టు మొదటి రోజు ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. వర్షంతో పాటు వెలుతురు లేమి కారణంగా మ్యాచ్‌ను అంపైర్‌లు నిలిపివేశారు. మ్యాచ్‌ నిలిచిపోయే సమయానికి టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్‌ రాహుల్‌(70), మహ్మద్‌ సిరాజ్‌ ఉన్నారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడ ఐదు వికెట్లతో చెలరేగాడు.
చదవండి: IND vs SA 1st Test: టీమిండియాతో తొలి టెస్టు.. దక్షిణాఫ్రికాకు బిగ్‌ షాక్‌

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)