Breaking News

టీమిండియాతో మ్యాచ్‌ అంటే గల్లీ పోరగాళ్లతో ఆట? నేను ఆ మాట అనలే: పాక్‌ స్టార్‌

Published on Thu, 08/17/2023 - 19:47

Asia Cup 2023- India Vs Pakistan: టీమిండియాను ఉద్దేశించి పాకిస్తాన్‌ బ్యాటర్‌ ఇఫ్తికర్‌ అహ్మద్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడంటూ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ‘ఎక్స్‌’(ట్విటర్‌)లో ఓ పోస్ట్‌ వైరల్‌ అవుతోంది. దీంతో భారత జట్టు అభిమానులు అతడిపై అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ‘‘ఇంత పొగరు, అహంకారం పనికిరాదు.. అసలు టీమిండియా ముందు నువ్వెంత, మీ టీమ్‌ ఎంత?’’ అంటూ ఘాటైన వ్యాఖ్యలతో కౌంటర్లు ఇస్తున్నారు.

ఈ క్రమంలో తాను అసలు ఆ మాటలు అననేలేదంటూ ఇఫ్తికర్‌ అహ్మద్‌ సంజాయిషీ ఇచ్చుకున్నాడు. అంతేకాదు.. తాను చేయని వ్యాఖ్యలను తనకు ఆపాదిస్తూ నకిలీ వార్తలు ప్రచారం చేస్తున్న యూజర్లపై నిషేధం విధించాలంటూ ‘ఎక్స్‌’ అధినేత ఎలన్‌మస్క్‌కు విన్నవించుకున్నాడు. 

హై వోల్టేజీ మ్యాచ్‌..
కాగా భారత్‌- పాక్‌ మ్యాచ్‌ అంటే హైప్‌ ఏ రేంజ్‌లో ఉంటుందో తెలిసిందే! కేవలం ఆసియా కప్‌, ప్రపంచకప్‌ వంటి ఈవెంట్ల నేపథ్యంలోనే దాయాదులు పోటీ పడుతున్న తరుణంలో అంచనాలు మరింత ఎక్కువవుతున్నాయి. ఈ క్రమంలో ఈ ఏడాది ఆసియా వన్డే కప్‌, వన్డే వరల్డ్‌కప్‌లో చిరకాల ప్రత్యర్థుల పోటీ చూసే భాగ్యం అభిమానులకు దక్కింది.

ఆరోజే తొలిసారి
ఇందులో భాగంగా ఈ దఫా శ్రీలంక వేదికగా సెప్టెంబరు 2న తొలిసారి భారత్‌- పాక్‌ మ్యాచ్‌ జరుగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మ్యాచ్‌ గురించి ఇరు దేశాల ఆటగాళ్లు చేస్తున్న కామెంట్లు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. 

ఈ క్రమంలో..‘‘ టీమిండియాతో మ్యాచ్‌ అంటే.. గల్లీ పోరగాళ్లతో ఆడినట్లే ఉంటది’’ అని ఇఫ్తికర్‌ అహ్మద్‌ అన్నట్లు నవాజ్‌ అనే ఎక్స్‌ యూజర్‌ ట్వీట్‌ చేశాడు. దీంతో అహ్మద్‌పై టీమిండియా అభిమానులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో అతడు వివరణ ఇచ్చుకోకతప్పలేదు.

నేను ఆ మాట అనలే.. విద్వేషం రగిల్చకండి
‘‘నేనసలు ఎప్పుడూ ఇలాంటి ప్రకటన చేయలేదు. నేనే కాదు.. ప్రొఫెషనల్‌ క్రికెటర్‌ ఎవరూ కూడా ఇలాంటి మాటలు మాట్లాడరు. ఇలాంటి నకిలీ వార్తలు ప్రచారం చేయడం ఆపండి. 

విద్వేషం రగిల్చేలా వ్యవహరించిన ఈ వ్యక్తి గురించి ఎలన్‌మస్క్‌కు రిపోర్టు చేస్తున్నా. దయచేసి ఈ అకౌంట్‌ను నిషేధించండి’’ అని ఇఫ్తికర్‌ అహ్మద్‌ విజ్ఞప్తి చేశాడు. కాగా ఆసియా కప్‌-2023లో టీమిండియాను ఢీకొట్టబోయే బాబర్‌ ఆజం జట్టులో 32 ఏళ్ల ఇఫ్తికర్‌ అహ్మద్‌కు చోటు దక్కిన విషయం తెలిసిందే.

చదవండి: తూచ్‌! నిర్ణయం వెనక్కి.. దేశం కంటే ఏదీ ఎక్కువ కాదు! స్టోక్స్‌ ఒక్కడేనా?

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)