Breaking News

కోహ్లి ఫ్యాన్స్‌కు కనువిందు.. రోహిత్‌ ఒక్కడే కాదు.. యువీ, భజ్జీ కూడా..!

Published on Mon, 10/24/2022 - 20:47

విరాట్‌ వీరోచిత పోరాటం కారణంగా నిన్న (అక్టోబర్‌ 23) పాక్‌తో జరిగిన ఉత్కంఠ సమరంలో టీమిండియా 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. పొట్టి క్రికెట్‌ చరిత్రలో మరపురానిదిగా మిగిలిపోయే ఈ సమరంలో ఎన్నో మలుపులు, మరెన్నో రికార్డులు నమోదవ్వడంతో పాటు అంతకుమించిన ఆసక్తికర దృశ్యాలు క్రికెట్‌ ప్రేమికులకు మధురానుభూతులను మిగిల్చాయి. మ్యాచ్‌ అనంతరం కోహ్లి కళ్లు చెమర్చడం, రోహిత్‌.. విరాట్‌ను భుజంపైకి ఎత్తుకుని విజయ గర్వంతో గర్జించడం, భావోద్వేగంతో హార్ధిక్‌ కంటతడి పెట్టడం, సునీల్‌ గవాస్కర్‌ డ్యాన్స్‌ చేయడం.. ఇలా చాలా సన్నివేశాలు భారత క్రికెట్‌ అభిమానుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోతాయి.   

వీటిలో హిట్‌మ్యాన్‌.. కోహ్లిని భుజంపై ఎత్తుకున్న సన్నివేశం ప్రేక్షకులకు విశేషంగా ఆకట్టుకుంది. ఈ సన్నివేశాన్ని చూసిన రోహిత్‌, విరాట్‌ ఫ్యాన్స్‌ సంతోషంతో ఉప్పొంగిపోతున్నారు. టీమిండియా కృష్ణార్జునులు, ట్రిపుల్‌ ఆర్‌ రామ్‌-భీమ్‌ అంటూ సోషల్‌మీడియాను హోరెత్తిస్తున్నారు. రోహిత్‌-విరాట్‌ను ఎత్తుకున్న సన్నివేశం సోషల్‌మీడియాలో ట్రెండ్‌ అవుతున్న నేపథ్యంలో రెండు పాత వీడియోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 

అవేంటంటే.. పాక్‌పై విక్టరీ అనంతరం రోహిత్‌.. కోహ్లిని ఎలా ఎత్తుకున్నాడో అచ్చం అలానే గతంలో యువరాజ్‌ సింగ్‌, హర్భజన్‌ సింగ్‌లు కోహ్లిని ఎత్తుకున్నారు. 2014లో సౌతాఫ్రికాపై కోహ్లి మ్యాచ్‌ విన్నింగ్‌ ఇన్నింగ్స్‌ (72 నాటౌట్‌) అనంతరం యువీ.. కోహ్లిని మైదానం మొత్తం ఎత్తుకుని తిరిగాడు. మొహాలీ వేదికగా 2016లో కోహ్లి ఆడిన చారిత్రక ఇన్నింగ్స్‌ (82 నాటౌట్‌)కు ఫిదా అయిన భజ్జీ కూడా కోహ్లిని రెండు చేతులతో ఎత్తుకుని అభినందించాడు. పై మూడు సందర్భాలకు సంబంధించిన సన్నివేశాలను ఓ నెటిజన్‌ ఎడిట్‌ చేసి ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాను షేక్‌ చేస్తుంది. కోహ్లి ధమాకా ఇన్నింగ్స్‌ నుంచి ఇంకా తేరుకోని ఫ్యాన్స్‌ ఈ వీడియోను చూసి తెగ ముచ్చటపడిపోతున్నారు. 
చదవండి: ద్రవిడ్‌ను వెనక్కు నెట్టిన కోహ్లి.. ఇక మిగిలింది ఐదుగురే..!

Videos

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనస్ రాజీనామా ?

తమన్నా అవసరమా.. కర్ణాటకలో కొత్త వివాదం

Vijayawada: వల్లభనేని వంశీ విజువల్స్

వైఎస్ఆర్ సీపీ కార్యకర్త హరికృష్ణకు CI భాస్కర్ చిత్రహింసలు

కసిగట్టిన కరోనా మళ్లీ వచ్చేసింది!

MDU Operators: కరోన లాంటి కష్టకాలంలో కూడా ప్రాణాలకు తెగించి కష్టపడ్డాం..

Rachamallu Siva Prasad: చంద్రబాబు మార్క్ లో చెప్పుకోవడానికి ఏమీ లేదు..

ప్రజలకు ఎంతో సహాయపడ్డాం.. ఇప్పుడు మమ్మల్ని రోడ్డున పడేశావు

Bhuma Kishore:స్టేజి ఎక్కితే ఏం మాట్లాడుతుందో అఖిల ప్రియకే అర్ధం కాదు

New Movie: ఏకంగా ముగ్గురితో అల్లుఅర్జున్

Photos

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)