Breaking News

Ind vs Pak: భారత్‌దే విజయం

Published on Sat, 10/19/2024 - 20:55

ఏసీసీ మెన్స్ ట్వంటీ 20 ఎమర్జింగ్ ఆసియా కప్ 2024 టోర్నీలో భారత -A.  జట్టు 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్ విసిరిన 184 పరుగుల లక్ష్య చేదనలో పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 176 పరుగులకే పరిమితమైంది. అంతకముందు భారత్‌- ‘ఎ’ మెరుగైన స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఓపెనర్లు అభిషేక్‌ శర్మ, ప్రభ్‌సిమ్రన్‌సింగ్‌ శుభారంభం అందించగా.. తిలక్‌ వర్మ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌లో అలరించాడు.

ఏసీసీ మెన్స్‌ టీ20 ఎమర్జింగ్‌ టీమ్స్‌ ఆసియా కప్‌-2024లో భాగంగా భారత్‌- పాక్‌ యువ జట్టు ఒమన్‌లోని అల్‌ అమెరట్‌ వేదికగా శనివారం మ్యాచ్‌ ఆడుతున్నాయి. ఓపెనర్లు అభిషేక్‌ శర్మ 22 బంతుల్లో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 35 పరుగులు చేయగా.. ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో దుమ్ములేపాడు.

ప్రభ్‌సిమ్రన్‌ ధనాధన్‌.. తిలక్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌
కేవలం 19 బంతుల్లోనే 3 ఫోర్లు ,3 సిక్సర్ల సాయంతో 36 పరుగులు సాధించాడు. వన్‌డౌన్‌లో వచ్చిన తిలక్‌ వర్మ 35 బంతుల్లో 44 పరుగులతో రాణించగా.. నేహల్‌ వధేరా(22 బంతుల్లో 25) ఫర్వాలేదనిపించాడు. మిగిలిన వాళ్లలో రమణ్‌దీప్‌ సింగ్‌(17) ఒక్కడే సింగిల్‌ డిజిట్‌ స్కోరు దాటాడు. ఆయుశ్‌ బదోని(2), నిషాంత్‌ సంధు(6), అన్షుల్‌ కాంబోజ్‌(0), రాహుల్‌ చహర్‌(4*), రసిద్‌ దార్‌ సలాం(6*) కనీసం పోరాట పటిమ ప్రదర్శించలేదు.

ఇక పాక్‌ బౌలర్లలో ఇమ్రాన్‌, జమాన్‌ ఖాన్‌, మిన్హాస్‌, కాసిం అక్రం ఒక్కో వికెట్‌ తీయగా.. సూఫియాన్‌ ముకీమ్‌ రెండు వికెట్లతో సత్తా చాటాడు. కాగా భారత టాపార్డర్‌ రాణించిన కారణంగా పాకిస్తాన్‌కు తిలక్‌ సేన 184 పరుగుల లక్ష్యాన్ని విధించగలిగింది.

భారత్‌- ‘ఎ’ వర్సెస్‌ పాకిస్తాన్‌- ‘ఎ’ప్లేయింగ్‌ ఎలెవన్‌
ఇండియా
అభిషేక్ శర్మ, ప్రభ్ సిమ్రాన్ సింగ్(వికెట్ కీపర్), రమణ్‌దీప్‌ సింగ్, అన్షుల్ కాంబోజ్, తిలక్ వర్మ(కెప్టెన్), ఆయుష్ బదోని, నేహాల్ వధేరా, నిశాంత్ సింధు, రాహుల్ చాహర్, రసిక్ దార్ సలామ్, వైభవ్ అరోరా.
పాకిస్తాన్‌
హైదర్ అలీ, మహ్మద్ హారిస్(కెప్టెన్), యాసిర్ ఖాన్, ఒమైర్ యూసుఫ్, ఖాసీం అక్రమ్, అబ్దుల్ సమద్, అరాఫత్ మిన్హాస్, అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ ఇమ్రాన్, జమాన్ ఖాన్, సూఫియాన్ ముకీమ్.

చదవండి: Ind vs NZ: అయ్యో పంత్‌! .. నీకే ఎందుకిలా?

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)