Breaking News

Ind vs Pak: నువ్వేమైనా హీరోవా?: పాక్‌ మాజీ క్రికెటర్‌ ఫైర్‌

Published on Sun, 10/20/2024 - 16:43

వర్దమాన ఆసియా టీ20 కప్‌-2024లో భారత్‌- పాకిస్తాన్‌ మ్యాచ్‌ సందర్భంగా జరిగిన ఘటనపై పాక్‌ మాజీ క్రికెటర్‌ బసిత్‌ అలీ స్పందించాడు. యువ ఆటగాళ్లకు ప్రత్యర్థి జట్టును గౌరవించే సంస్కారం నేర్పాలంటూ పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ)కు హితవు పలికాడు. అభిషేక్‌ శర్మ పట్ల సూఫియాన్‌ ముఖీమ్‌ ప్రవర్తన సరికాదంటూ మండిపడ్డాడు.

కాగా ఏసీసీ మెన్స్‌ టీ20 ఎమర్జింగ్‌ టీమ్స్‌ ఆసియా కప్‌ టోర్నీలో భారత్‌-‘ఎ’ జట్టు శుభారంభం చేసిన విషయం తెలిసిందే. ఒమన్‌ వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌-‘ఎ’పై తిలక్‌ వర్మ సేన ఏడు పరుగుల తేడాతో గెలుపొందింది. శనివారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌ సందర్భంగా.. భారత ఓపెనర్‌ అభిషేక్‌ శర్మను రెచ్చగొట్టేలా పాక్‌ యువ స్పిన్నర్‌ సూఫియాన్‌ ముఖీమ్‌ ప్రవర్తించాడు.

అభిషేక్‌ ధనాధన్‌
టాస్‌ గెలిచిన భారత్‌ తొలుత బ్యాటింగ్‌ చేసిన క్రమంలో అభిషేక్‌.. 22 బంతులు ఎదుర్కొని 35 పరుగులు రాబట్టాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఐదు బౌండరీలు, రెండు సిక్సర్లు ఉన్నాయి. అయితే, దూకుడుగా ఆడుతున్న సమయంలో ఆరో ఓవర్‌ ఆఖరి బంతికి సూఫియాన్‌ బౌలింగ్‌లో అభిషేక్‌.. కాసిం అక్రంకు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు.

సూఫియాన్‌ ఓవరాక్షన్‌
దీంతో భారత్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. అయితే, అభిషేక్‌ అవుట్‌ కాగానే సూఫియాన్‌ ఓవరాక్షన్‌ చేశాడు. ‘నోరు మూసుకుని.. ఇక దయచెయ్‌’’ అన్నట్లుగా ముక్కుమీద వేలు వేసి అభిషేక్‌కు సైగ చేశాడు. దీంతో కోపోద్రిక్తుడైన అభిషేక్‌ సూఫియాన్‌ వైపునకు సీరియస్‌గా చూశాడు. ఈ క్రమంలో అంపైర్లు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది.

నువ్వేమైనా హ్యాట్రిక్‌ హీరోవా?
ఈ ఘటనపై పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ బసిత్‌ అలీ స్పందిస్తూ.. ‘‘క్రికెట్‌ అంటేనే టాప్‌ క్లాస్‌. కానీ.. సూఫియాన్‌ ముఖీమ్‌- అభిషేక్‌ శర్మ మధ్య జరిగిన ఘటన నన్ను నిరాశకు గురిచేసింది. ఒకవేళ నేనే గనుక పాక్‌ జట్టు టీమ్‌ మేనేజర్‌గా డకౌట్‌లో ఉండి ఉంటే.. వెంటనే సూఫియాన్‌ను పిలిచి.. ‘‘బేటా.. ఇక బ్యాగు సర్దుకుని బయల్దేరు’ అని చెప్పేవాడిని.

బుద్ధి నేర్పించాలి
నువ్వసలు పాకిస్తాన్‌ తరఫున ఇంకా పూర్తిస్థాయిలో క్రికెట్‌ ఆడనేలేదు. ఇప్పుడే ఇలా అసభ్యకరమైన రీతిలో ప్రత్యర్థి జట్టు ఆటగాడిని దూషిస్తావా? ఇదేం ప్రవర్తన? నువ్వేమైనా హ్యాట్రిక్‌ హీరోవా? ఇంకా నీ బౌలింగ్‌పై ఎవరికీ అవగాహనే లేదు. అప్పుడే ఇలాంటి ప్రవర్తనా? మేనేజ్‌మెంట్‌ యువ ఆటగాళ్లకు కాస్త బుద్ధి నేర్పించాలి.

ప్రత్యర్థి జట్టును గౌరవించాలనే సంస్కారం నేర్పించండి’’ అని పీసీబీకి హితవు పలికాడు. కాగా పాకిస్తాన్‌తో శనివారం నాటి మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసి.. భారత్‌ గెలుపులో కీలక పాత్ర పోషించిన అన్షుల్‌ కాంబోజ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు.

చదవండి: WTC 2023-25 Points Table: న్యూజిలాండ్ చేతిలో ఓటమి.. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే..?

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)