Breaking News

కివీస్‌ దారుణ ఆటతీరు.. చెత్త రికార్డు నమోదు

Published on Sat, 01/21/2023 - 15:20

రాయ్‌పూర్‌ వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో న్యూజిలాండ్‌ దారుణ ఆటతీరును ప్రదర్శిస్తోంది. తొలి వన్డేలో పోరాడిన జట్టేనా ఇప్పుడు ఆడుతుంది అన్న తరహాలో కివీస్‌ బ్యాటింగ్‌ సాగుతుంది. ప్రస్తుతం 22 ఓవర్లు ముగిసేసరికి ఆరు వికెట్ల నష్టానికి 66 పరుగులు చేసింది. గ్లెన్‌ పిలిప్స్‌ 20, మిచెల్‌ సాంట్నర్‌ ఆరు పరుగులతో క్రీజులో ఉ‍న్నారు.

లాస్ట్‌ మ్యాచ్‌లో సెంచరీతో ఆకట్టుకున్న మైకెల్‌ బ్రాస్‌వెల్‌ ఈ మ్యాచ్‌లో 22 పరుగులు చేసి ఔటయ్యాడు. టీమిండియా బౌలర్ల దాటికి కివీస్‌ టాపార్డర్‌ కకావికలమైంది. మహ్మద్‌ షమీ తన పేస్‌ పదును చూపిస్తూ మూడు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్‌, పాండ్యా, శార్దూల్‌ ఠాకూర్‌లు తలా ఒక వికెట్‌ తీశారు.

ఈ క్రమంలోనే న్యూజిలాండ్‌ వన్డేల్లో ఒక చెత్త రికార్డు నమోదు చేసింది. టీమిండియాతో వన్డేలో 15 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన కివీస్‌కు ఇదే అత్యల్పం. ఇంతకముందు 2001లో శ్రీలంకతో మ్యాచ్‌లో 18 పరుగులకు ఐదు వికెట్లు, 2010లో బంగ్లా తో మ్యాచ్‌లో 20 పరుగులకు ఐదు వికెట్లు, 2003లో ఆస్ట్రేలియాపై 21 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది.

చదవండి: రోహిత్‌ శర్మ.. ఇంత మతిమరుపా!

Videos

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనస్ రాజీనామా ?

తమన్నా అవసరమా.. కర్ణాటకలో కొత్త వివాదం

Vijayawada: వల్లభనేని వంశీ విజువల్స్

వైఎస్ఆర్ సీపీ కార్యకర్త హరికృష్ణకు CI భాస్కర్ చిత్రహింసలు

కసిగట్టిన కరోనా మళ్లీ వచ్చేసింది!

MDU Operators: కరోన లాంటి కష్టకాలంలో కూడా ప్రాణాలకు తెగించి కష్టపడ్డాం..

Rachamallu Siva Prasad: చంద్రబాబు మార్క్ లో చెప్పుకోవడానికి ఏమీ లేదు..

ప్రజలకు ఎంతో సహాయపడ్డాం.. ఇప్పుడు మమ్మల్ని రోడ్డున పడేశావు

Bhuma Kishore:స్టేజి ఎక్కితే ఏం మాట్లాడుతుందో అఖిల ప్రియకే అర్ధం కాదు

New Movie: ఏకంగా ముగ్గురితో అల్లుఅర్జున్

Photos

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)