Breaking News

Ind Vs NZ: ఉమ్రాన్‌ బౌలింగ్‌లో వైవిధ్యం లేదు.. కాబట్టి: భారత మాజీ క్రికెటర్‌

Published on Sat, 11/26/2022 - 15:39

New Zealand vs India, 1st ODI- Umran Malik: టీమిండియా యువ ఫాస్ట్‌ బౌలర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ను ఉద్దేశించి భారత మాజీ ఓపెనర్‌ వసీం జాఫర్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఉమ్రాన్‌ టీ20 ఫార్మాట్‌లో కంటే వన్డేల్లోనే ఎక్కువ ప్రభావం చూపగలడని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించిన జమ్మూ ఎక్స్‌ప్రెస్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించి.. అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే.

అత్యంత వేగంగా బంతులు విసరడంలో దిట్ట అయిన 23 ఏళ్ల ఉమ్రాన్‌ ఐర్లాండ్‌తో టీ20 ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. తాజాగా న్యూజిలాండ్‌తో సిరీస్‌ నేపథ్యంలో వన్డేల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. కివీస్‌తో అరంగేట్ర మ్యాచ్‌లో 10 ఓవర్ల బౌలింగ్‌ కోటా పూర్తి చేసి 66 పరుగులు సమర్పించుకున్నాడు. 

వన్డేలకే సూట్‌ అవుతాడు!
ఆరంభంలో బాగానే బౌలింగ్‌ చేసి రెండు వికెట్లు పడగొట్టినా తర్వాత పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ఈ నేపథ్యంలో వసీం జాఫర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ ఇన్ఫోతో అతడు మాట్లాడుతూ.. ‘‘మ్యాచ్‌ ఎంత ఎక్కువ సేపు సాగితే అంత ఎక్కువగా మన నైపుణ్యాలు ప్రదర్శించే అవకాశం ఉంటుంది.

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో టీ20ల కంటే కూడా వన్డేల్లో ఇలా బౌలింగ్‌ చేయడం ద్వారా యువ ఆటగాళ్లకు ఆట గురించి మరింత ఎక్కువగా అవగాహన పెంచుకునే ఆస్కారం ఉంటుంది. నిజానికి ఉమ్రాన్‌ మాలిక్‌ టీ20 ఫార్మాట్‌ కంటే కూడా వన్డేలకే ఎక్కువగా సూట్‌ అవుతాడు. ఐపీఎల్‌లో అతడి బౌలింగ్‌ను గమనించాం.

నిజానికి అక్కడ(టీ20) తను వైవిధ్యం చూపలేకపోయాడు. సరైన లెంత్‌తో బౌలింగ్‌ చేయలేకపోయాడు. అయితే, వన్డే ఫార్మాట్‌లో తను ప్రయోగాలు చేసేందుకు, వైవిధ్యం ప్రదర్శించేందుకు ఆస్కారం ఉంటుంది’’ అని చెప్పుకొచ్చాడు.

బౌలర్ల తప్పేం లేదు.. అర్ష్‌ భేష్‌
ఇక అర్ష్‌దీప్‌ సింగ్‌ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘పరిస్థితులకు తగ్గట్టుగా తన ఆట తీరును మార్చుకోవండంలో అతడు దిట్ట. రోజురోజుకు నైపుణ్యాలు మెరుగుపరచుకుని మరింత రాటుదేలుతున్నాడు’’ అని వసీం జాఫర్‌ చెప్పుకొచ్చాడు. కాగా కివీస్‌తో మొదటి వన్డేలో అర్ష్‌ 8.1 ఓవర్లలో 68 పరుగులు ఇవ్వడం గమనార్హం.

కాగా కివీస్‌తో మొదటి వన్డేలో భారీ స్కోరు చేసినప్పటికీ టీమిండియా ఓడిపోవడంపై స్పందిస్తూ.. ‘‘నిజానికి ఆ పిచ్‌ రాను రాను బ్యాటర్లకు మరింతగా అనుకూలించింది. ముఖ్యంగా కివీస్‌ ఇన్నింగ్స్‌ రెండో అర్ధభాగంలో భారత బౌలర్లకు మరింత కష్టతరంగా మారింది’’ అంటూ టీమిండియా బౌలర్లను వెనకేసుకొచ్చాడు.  

చదవండి: Ban Vs Ind 2022: టీమిండియా బంగ్లాదేశ్‌ పర్యటన.. పూర్తి షెడ్యూల్‌, లైవ్‌ స్ట్రీమింగ్‌, ఇతర వివరాలు
FIFA WC 2022: అర్జెంటీనాపై సంచలన విక్టరీ.. సౌదీ అరేబియా ఆటగాళ్లకు ఊహించని నజరానా

Videos

ఆసరాకు బాబు మంగళం

కల్లితండాలో సైనిక లాంఛనాలతో మురళీనాయక్ అంత్యక్రియలు

ఇవాళ భారత్-పాక్ మధ్య హాట్ లైన్ లో చర్చలు

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తో సాక్షి స్ట్రెయిట్ టాక్

1800 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్

రేపు కల్లి తండాకు మాజీ సీఎం వైఎస్ జగన్

లాస్ట్ పంచ్.. బ్రహ్మోస్ మిస్సైల్ తో దెబ్బ అదుర్స్..

నాగార్జున సాగర్ కు అందగత్తెలు

భారత్ సత్తా ప్రపంచానికి చాటిచెప్పిన ఆపరేషన్ సిందూర..

తూటా పేలిస్తే క్షిపణితో బదులిస్తామని పాక్ కు ప్రధాని మోదీ హెచ్చరిక

Photos

+5

నందమూరి తారక రామారావు ఎంట్రీ సినిమా పూజా కార్యక్రమం (ఫోటోలు)

+5

తిరుపతి: గంగమ్మ జాతర.. మాతంగి వేషంలో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు (ఫొటోలు)

+5

విశాఖపట్నం : ఆర్కే బీచ్‌లో సందర్శకుల సందడే సందడి (ఫొటోలు)

+5

యాదగిరిగుట్టలో గిరి ప్రదక్షిణ.. భారీగా పాల్గొన్న భక్తులు (ఫొటోలు)

+5

వీరజవాన్‌ మురళీ నాయక్‌ అంతిమ వీడ్కోలు.. జైహింద్‌.. అమర్‌రహే నినాదాలు (ఫొటోలు)

+5

‘లెవన్‌’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

మిస్‌ వరల్డ్‌ : అందాల ముద్దుగుమ్మలు సందడి.. (ఫొటోలు)

+5

తిరుమల దర్శనం చేసుకున్న యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)

+5

మదర్స్ డే స్పెషల్.. హీరోయిన్ ప్రణీత పిల్లల్ని చూశారా? (ఫొటోలు)

+5

డాక్టర్ బాబు నిరుపమ్‌ భార్య బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)