Breaking News

IND vs NZ: ముగిసిన తొలి రోజు ఆట.. రోహిత్‌ శర్మ డకౌట్‌

Published on Thu, 10/24/2024 - 17:19

పుణే వేదిక‌గా న్యూజిలాండ్‌-భార‌త్ మ‌ధ్య జ‌రుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఆట ముగిసింది. మొద‌టి రోజు ఆటముగిసే స‌మ‌యానికి టీమిండియా త‌మ‌ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ న‌ష్టానికి 16 ప‌రుగులు చేసింది. క్రీజులో యువ ఆట‌గాళ్లు శుబ్‌మ‌న్ గిల్‌(10), య‌శ‌స్వీ జైశ్వాల్‌(6) ప‌రుగుల‌తో ఆజేయంగా ఉన్నారు.

అయితే కెప్టెన్ రోహిత్ శ‌ర్మ మాత్రం నిరాశ‌ప‌రిచాడు. 9 బంతులు ఎదుర్కొని ఖాతా తెర‌వ‌కుండానే పెవిలియ‌న్‌కు చేరాడు. కివీస్ స్టార్ పేస‌ర్ టిమ్‌ సౌథీ బౌలింగ్‌లో రోహిత్‌ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.

ఏడేసిన సుందర్‌..
ఇక ఈ మ్యాచ్‌లో భార‌త ఆల్‌రౌండ‌ర్ వాషింగ్ట‌న్ సుంద‌ర్ అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. 7 వికెట్ల‌తో సుంద‌ర్ స‌త్తాచాటాడు. కివీస్ నామ‌మాత్ర‌పు స్కోర్‌కే ప‌రిమితం కావ‌డంలో వాషింగ్ట‌న్ కీల‌క పాత్ర పోషించాడు. అత‌డితో పాటు అశ్విన్ 3 వికెట్లు ప‌డ‌గొట్టాడు. న్యూజిలాండ్ బ్యాటర్లలో ఓపెనర్ డేవాన్ కాన్వే (76; 141 బంతుల్లో 11 ఫోర్లు) హాఫ్ సెంచ‌రీతో మెర‌వ‌గా.. రచిన్ రవీంద్ర (65; 105 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) మరోసారి కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)