Breaking News

IND vs NZ: వర్షం వల్ల ఆట ‘రద్దు’

Published on Mon, 11/09/2026 - 11:48

న్యూజిలాండ్‌- భారత్‌ ‘ఎ’ జట్ల మధ్య మూడో అనధికారిక టెస్టులో మూడో రోజు ఆట ఒక్క బంతి కూడా పడకుండానే రద్దైపోయింది. దీంతో ఆతిథ్య కివీస్‌కు ఊరట లభించినట్లయింది. లిన్‌కోన్‌ వేదికగా ఇరుజట్ల మధ్య శనివారం మూడో అనధికారిక టెస్టు మొదలైన సంగతి తెలిసిందే.

జైస్వాల్‌ శతకం.. సాయి, జురెల్‌, తిలక్‌, సుందర్‌ అర్ధ శతకాలు
టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ జట్టు తొలుత బౌలింగ్‌ ఎంచుకోగా.. భారత్‌ బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లలో యశ​స్వి జైస్వాల్‌ శతక్కొట్టగా (102).. సాయి సుదర్శన్‌ అద్భుత అర్ధ శతకం (88)తో ఆకట్టుకున్నాడు. వన్‌డౌన్‌లో వచ్చిన దేవదత్‌ పడిక్కల్‌ (15) విఫలమైనా.. కెప్టెన్‌ ధ్రువ్‌ జురెల్‌ (71), తిలక్‌ వర్మ (81 నాటౌట్‌) అర్ధ శతకాలతో అదరగొట్టారు.

భారత్‌ భారీ స్కోరు
స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్లలో సీనియర్‌ రవీంద్ర జడేజా 25 పరుగులు చేయగా.. వాషింగ్టన్‌ సుందర్‌ అర్ధ శతకం (50)తో అజేయంగా నిలిచాడు. ఫలితంగా ఐదు వికెట్ల నష్టానికి 464 పరుగుల భారీ స్కోరు వద్ద భారత్‌ తమ తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది.

కివీస్‌ బౌలర్లలో జాక్‌ గిబ్సన్‌ రెండు వికెట్లు తీయగా.. జారోడ్‌ మెకాయ్‌, కామెరాన్‌ పాల్‌, డనురు ఫెర్న్స్‌ తలా ఒక వికెట్‌ పడగొట్టారు. అనంతరం న్యూజిలాండ్‌ తమ మొదటి ఇన్నింగ్స్‌ మొదలుపెట్టగా.. గాయం నుంచి కోలుకుని రీఎంట్రీ ఇచ్చిన భారత పేసర్‌ ప్రసిద్‌ కృష్ణ కివీస్‌కు చుక్కలు చూపించాడు.

రెండు వికెట్లు తీసిన ప్రసిద్‌
ఓపెనర్లు రైస్‌ మరియును డకౌట్‌ చేసిన ప్రసిద్‌.. కర్టిస్‌ హీపీని 19 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఈ క్రమంలో రెండో రోజు ఆట పూర్తయ్యేసరికి న్యూజిలాండ్‌ 14 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 36 పరుగులు చేసింది. డీన్‌ ఫాక్స్‌క్రాఫ్ట్‌ 10, జాక్‌ గిబ్సన్‌ ఒక పరుగుతో క్రీజులో నిలిచారు.

మూడో రోజు ఆట రద్దు
ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌ భారత్‌ కంటే 428 పరుగుల వెనుకబడి ఉంది. అయితే, మూడో రోజు ఆటకు వర్షం పదే పదే ఆటంకం కలిగించింది. వాన ఎంతకూ తెరిపినివ్వకపోవడంతో ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్‌ను ముగిసిస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఫలితంగా కివీస్‌ ఇంకా 428 పరుగులు వెనుకబడే ఉంది.

ఇదీ చదవండి: IND vs PAK: సెహ్వాగ్‌ కొడుకుపై పాక్ బౌలర్ ఓవరాక్షన్.. నెక్ట్స్ మనోడు చూసుకుంటాడులే!

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)