Breaking News

న్యూజిలాండ్‌తో రెండో టీ20.. టీమిండియాలో రెండు మార్పులు..? అర్షదీప్‌తో పాటు..!

Published on Sun, 01/29/2023 - 15:01

లక్నో వేదికగా న్యూజిలాండ్‌తో ఇవాళ (జనవరి 29) జరుగనున్న రెండో టీ20 మ్యాచ్‌ టీమిండియాకు అత్యంత కీలకంగా మారింది. తొలి టీ20లో పర్యాటక జట్టు చేతిలో ఎదురైన పరాభవం నేపథ్యంలో సిరీస్‌పై ఆశలు సజీవంగా నిలవాలంటే టీమిండియా నేటి మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందుకోసం టీమ్‌ మేనేజ్‌మెంట్‌ తుది జట్టులో పలు మార్పులు చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

రాంచీ మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌లో ధారాళంగా పరుగులు సమర్పించుకుని జట్టు ఓటమికి పరోక్ష కారణమైన అర్షదీప్‌పై వేటు దాదాపుగా ఖరారైంది. అతని స్థానంలో బీహార్‌ పేసర్‌ ముకేశ్‌ కుమార్‌ అరంగేట్రం చేయడం లంఛనమేనని తెలుస్తోంది. ఇకపోతే, నేటి మ్యాచ్‌లో టీమిండియాలో మరో మార్పు కూడా జరిగే అవకాశం ఉందని సమాచారం.

రాహుల్‌ త్రిపాఠి స్థానంలో యువ ఆటగాడు పృథ్వీ షాను ఆడించాలన్నది కోచ్‌ ద్రవిడ్‌ ఆలోచనగా తెలుస్తోంది. ఇదే జరిగితే గిల్‌తో పాటు ఎవరు ఓపెనింగ్‌ చేస్తారన్నది ప్రశ్నార్ధకంగా మారుతుంది. లెఫ్‌ అండ్‌ రైట్‌ కాంబినేషన్‌ను పరిగణలోకి తీసుకుంటే ఇషాన్‌ కిషన్‌.. లేకుంటే పృథ్వీ షా గిల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ ప్రారంభిస్తారు.

ఈ రెండు మార్పులు మినహా తొలి మ్యాచ్‌లో ఆడిన జట్టే యధాతథంగా బరిలోకి దిగే అవకాశం ఉంది. బెంచ్‌పై ఆప్షన్స్‌ లేకపోవడం, అలాగే తొలి మ్యాచ్‌లో అందరూ తమతమ పాత్రలకు కొద్దో గొప్పో న్యాయం చేయడంతో తుది జట్టులో ఇంతకుమించి మార్పులకు ఆస్కారం ఉండకపోవచ్చు.

రెండో టీ20కి భారత తుది జట్టు (అంచనా)..
శుభ్‌మన్‌ గిల్‌, ఇషాన్‌ కిషన్‌, పృథ్వీ షా, సూర్యకుమార్‌ యాదవ్‌, హార్ధిక్‌ పాండ్యా, దీపక్‌ హుడా, వాషింగ్టన్‌ సుందర్‌, శివమ్‌ మావీ, కుల్దీప్‌ యాదవ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, ముకేశ్‌ కుమార్‌


 

Videos

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

కేటీఆర్, హరీష్ రావు అరెస్ట్..!

విజయవాడ పోలీస్ స్టేషన్ లో యూట్యూబర్ నందన

కేసీఆర్ ఫాంహౌస్ వద్ద 144 సెక్షన

మహికాతో బ్రేక్ అప్? అమీషా పటేల్ తో హార్దిక్ డేటింగ్!

Photos

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)