Breaking News

IND VS NZ 1st Test: హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న సర్ఫరాజ్‌

Published on Fri, 10/18/2024 - 16:32

బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో (సెకెండ్‌ ఇన్నింగ్స్‌) టీమిండియా మిడిలార్డర్‌ బ్యాటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. సర్ఫరాజ్‌ కేవలం 42 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో హాఫ్‌ సెంచరీ చేశాడు. టెస్ట్‌ల్లో సర్ఫరాజ్‌కు ఇది నాలుగో హాఫ్‌ సెంచరీ. కష్టాల్లో ఉన్న భారత్‌ను సర్ఫరాజ్‌, విరాట్‌ (49) గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. భారత్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. 

యశస్వి జైస్వాల్‌ (35), రోహిత్‌ శర్మ (52) ఔట్‌ కాగా.. విరాట్‌, సర్ఫరాజ్‌ (51) క్రీజ్‌లో ఉన్నారు. భారత్‌.. న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు ఇంకా 167 పరుగులు వెనుకపడి ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ గట్టెక్కాలంటే మరో రెండు రోజులు బ్యాటింగ్‌ చేసి న్యూజిలాండ్‌ ముందు ఓ మోస్తరు లక్ష్యాన్ని ఉంచాల్సి ఉంది.

కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే కుప్పకూలిన విషయం తెలిసిందే. మ్యాట్‌ హెన్రీ (5/15), విలియమ్‌ ఓరూర్కీ (4/22), సౌథీ (1/8) టీమిండియా పతనాన్ని శాశించారు. భారత్‌ ఇన్నింగ్స్‌లో ఏకంగా ఐదుగురు (కోహ్లి, సర్ఫరాజ్‌, రాహుల్‌, జడేజా, అశ్విన్‌) డకౌట్‌ కాగా.. రిషబ్‌ పంత్‌ (20), యశస్వి జైస్వాల్‌ (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. రోహిత్‌ 2, కుల్దీప్‌ 2, బుమ్రా 1, సిరాజ్‌ 4 పరుగులు చేశారు.

అనంతరం న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 402 పరుగులకు ఆలౌటైంది. రచిన్‌ రవీంద్ర (134) సెంచరీతో, డెవాన్‌ కాన్వే (91), టిమ్‌ సౌథీ (65) అర్ద సెంచరీలతో సత్తా చాటారు. భారత బౌలర్లలో కుల్దీప్‌, జడేజా తలో మూడు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్‌ రెండు, అశ్విన్‌, బుమ్రా చెరో వికెట్‌ దక్కించుకున్నారు.

చదవండి: అనవసరమైన షాట్‌ ఆడి వికెట్‌ పారేసుకున్న యశస్వి

 

Videos

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)