Breaking News

ముగిసిన మూడో రోజు ఆట.. 125 పరుగుల వెనుకంజలో భారత్‌

Published on Fri, 10/18/2024 - 17:46

బెంగళూరు వేదికగా భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్‌ రసవత్తరంగా సాగుతుంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. మూడో రోజు చివరి బంతికి విరాట్‌ కోహ్లి (70) ఔటయ్యాడు. సర్ఫరాజ్‌ ఖాన్‌ (70) క్రీజ్‌లో ఉన్నాడు.

న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు భారత్‌ ఇంకా 125 పరుగులు వెనుకపడి ఉంది. భారత్‌ చేతిలో మరో ఏడు వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఇంకా రెండు రోజు ఆట మిగిలి ఉంది. భారత సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్‌ (35), రోహిత్‌ శర్మ (52), విరాట్‌ కోహ్లి ఔటయ్యారు. న్యూజిలాండ్‌ బౌలర్లలో అజాజ్‌ పటేల్‌ 2, గ్లెన్‌ ఫిలిప్స్‌ ఓ వికెట్‌ పడగొట్టారు.

అంతకుముందు న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 402 పరుగులకు ఆలౌటైంది. రచిన్‌ రవీంద్ర (134) సెంచరీతో, డెవాన్‌ కాన్వే (91), టిమ్‌ సౌథీ (65) అర్ద సెంచరీలతో సత్తా చాటారు. భారత బౌలర్లలో కుల్దీప్‌, జడేజా తలో మూడు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్‌ రెండు, అశ్విన్‌, బుమ్రా చెరో వికెట్‌ దక్కించుకున్నారు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 46 పరుగులకే కుప్పకూలింది. మ్యాట్‌ హెన్రీ (5/15), విలియమ్‌ ఓరూర్కీ (4/22), సౌథీ (1/8) టీమిండియా పతనాన్ని శాశించారు. భారత్‌ ఇన్నింగ్స్‌లో ఏకంగా ఐదుగురు (కోహ్లి, సర్ఫరాజ్‌, రాహుల్‌, జడేజా, అశ్విన్‌) డకౌట్‌ కాగా.. రిషబ్‌ పంత్‌ (20), యశస్వి జైస్వాల్‌ (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. రోహిత్‌ 2, కుల్దీప్‌ 2, బుమ్రా 1, సిరాజ్‌ 4 పరుగులు చేశారు.

చదవండి: మరో అరుదైన మైలురాయిని అధిగమించిన విరాట్‌

 

Videos

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)