More

Ind A vs NZ A 1st ODI: అదరగొట్టిన శార్దూల్‌, కుల్దీప్‌ సేన్‌.. 167 పరుగులకే కివీస్‌ ఆలౌట్‌

22 Sep, 2022 13:18 IST
( ఫైల్‌ ఫోటో )

India A vs New Zealand A, 1st unofficial ODI- NZ Score: న్యూజిలాండ్‌- ఏ జట్టుతో జరుగుతున్న మొదటి వన్డేలో భారత బౌలర్లు అదరగొట్టారు. శార్దూల్‌ ఠాకూర్‌ 4, కుల్దీప్‌ సేన్‌ 3 వికెట్లు పడగొట్టి కివీస్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనాన్ని శాసించారు. ఇక కుల్దీప్‌ యాదవ్‌ సైతం 9 ఓవర్ల బౌలింగ్‌లో కేవలం 22 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు.

ఈ నేపథ్యంలో 40.2 ఓవర్లకే న్యూజిలాండ్‌ కథ ముగిసింది. 167 పరుగులు చేసి రాబర్ట్‌ ఒడొనెల్‌ బృందం ఆలౌట్‌ అయింది. కాగా మూడు అనధికారిక టెస్టులు, మూడు అనధికారిక వన్డేలు ఆడే నిమిత్తం న్యూజిలాండ్‌- ఏ జట్టు భారత పర్యటనకు వచ్చింది. 

ఇందులో భాగంగా మొదటి రెండు టెస్టులు డ్రాగా ముగియగా.. మూడో మ్యాచ్‌లో భారత ఏ జట్టు 113 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ క్రమంలో చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా గురువారం మొదటి వన్డే ఆరంభమైంది.

టాస్‌ గెలిచిన సంజూ శాంసన్‌.. చెలరేగిన బౌలర్లు
టాస్‌ గెలిచిన భారత ఏ జట్టు కెప్టెన్‌ సంజూ శాంసన్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకున్నాడు. భారత్‌ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌కు ఆది నుంచే చుక్కలు చూపించారు బౌలర్లు. ఓపెనర్లు చెరో పది పరుగులు చేసి అవుటయ్యారు. మిగతా బ్యాటర్లు సైతం వరుసగా 4,1,22,0,5 పరుగులు చేసి పెవిలియన్‌కు క్యూ కట్టారు.

టాపార్డర్‌ కుప్పకూలిన వేళ మైఖేల్‌ రిప్పన్‌ 104 బంతుల్లో 61 పరుగులు చేసి జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. టెయిలెండర్‌ జో వాకర్‌ సైతం 36 పరుగులతో రాణించాడు. ఈ నేపథ్యంలో 167 పరుగులకు కివీస్‌ ఆలౌట్‌ అయింది.

చదవండి: Ind Vs Aus: కోహ్లి, పాండ్యా మాత్రమే! మిగతా వాళ్లంతా ఆ విషయంపై దృష్టి సారించకపోతే!
LLC 2022: జింబాబ్వే బ్యాటర్ల విధ్వంసం.. ఇండియా క్యాపిటల్స్‌ ఘన విజయం

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

వన్డేల్లో అత్యుత్తమ ఇన్నింగ్స్‌.. టాప్‌లో మ్యాక్స్‌వెల్‌, ఆతర్వాత భారత ఆటగాడు

CWC 2023: వరల్డ్‌ ఎలెవెన్‌ జట్టు.. నలుగురు భారత క్రికెటర్లకు చోటు

నెదర్లాండ్స్‌పై విజయం.. ఖుషీలో ఇంగ్లండ్‌ ఫ్యాన్స్‌, ఇంత మాత్రనికే..!

మహ్మద్‌ షమీ బౌలింగ్‌కు క్లీన్‌ బౌల్డ్‌ అయిన హీరోయిన్‌

CWC 2023: ప్రపంచకప్‌ చరిత్రలో తొలిసారి ఇలా..