Breaking News

CWC 2023: ప్రపంచకప్‌ చరిత్రలో తొలిసారి ఇలా..

Published on Thu, 11/09/2023 - 09:00

2023 వన్డే ప్రపంచకప్‌ రికార్డుల అడ్డాగా మారింది. ఈ ఎడిషన్‌లో నమోదైనన్ని రికార్డులు బహుశా ఏ ఎడిషన్‌లోనూ నమోదై ఉండకపోవచ్చు. ప్రతి మ్యాచ్‌లో పదుల సంఖ్యలో రికార్డులు నమోదవుతున్నాయి. ప్రపంచ రికార్డులు సైతం ఈ ఎడిషన్‌లో సులువుగా బద్దలవుతున్నాయి. 

తాజాగా ఇంగ్లండ్‌-నెదర్లాండ్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లోనూ పలు వ్యక్తిగత, టీమ్‌ రికార్డులు నమోదయ్యాయి. ఇందులో ఓ ప్రధానమైన రికార్డు ఉంది. అదేంటంటే.. ప్రపంచకప్‌ చరిత్రలో ఓ ఎడిషన్‌లో అన్ని జట్లు కనీసం రెండు మ్యాచ్‌లు గెలవడం ఇదే తొలిసారి. నెదర్లాండ్స్‌పై గెలుపుతో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లండ్‌ ప్రస్తుత వరల్డ్‌కప్‌లో రెండో విజయాన్ని (బంగ్లాదేశ్‌, నెదర్లాండ్స్‌) నమోదు చేసింది. నెదర్లాండ్స్‌ ఇదివరకే రెండు విజయాలు (సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌) సాధించింది. 

ప్రస్తుత ఎడిషన్‌లో పాల్గొన్న మిగతా జట్లు శ్రీలంక, బంగ్లాదేశ్‌ ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో చెరో రెండు విజయాలు సాధించాయి. ఈ ఎడిషన్‌లో భారత్‌ అందరికంటే ఎక్కువగా, ఆడిన 8 మ్యాచ్‌ల్లో 8 వరుస విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలిచింది. ఆ తర్వాత సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు చెరి 6 విజయాలు (8 మ్యాచ్‌ల్లో) సాధించాయి. న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌ జట్లు తలో 4 విజయాలు (8 మ్యాచ్‌ల్లో) నమోదు చేశాయి. మొత్తంగా ఈ ఎడిషన్‌లో పాల్గొన్న పది జట్లు కనీసం రెండ్రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించి వరల్డ్‌కప్‌ రికార్డు నెలకొల్పాయి.

ఇదిలా ఉంటే, బుధవారం నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 160 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన ఇంగ్లండ్‌ పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం నుంచి ఏడో స్థానానికి ఎగబాకింది. ఈ గెలుపుతో ప్రస్తుత వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌కు ఒరిగేదేమీ లేనప్పటికీ.. ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 అర్హత దృష్ట్యా కీలకంగా పరిగణించడుతుంది. వరల్డ్‌కప్‌ లీగ్‌ దశ తర్వాత టాప్‌-7లో ఉన్న జట్లు ఛాంపియన్స్‌ ట్రోఫీకి నేరుగా అర్హత సాధిస్తాయన్న విషయం తెలిసిందే. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)