Breaking News

IND VS NZ 1st ODI: టీమిండియా కొంపముంచిన శార్దూల్‌

Published on Fri, 11/25/2022 - 14:36

ఆక్లాండ్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో విజయం దిశగా సాగుతున్న టీమిండియాను శార్దూల్‌ ఠాకూర్‌ భ్రష్టు పట్టించాడు. ఒకే ఓవర్‌లో 25 పరుగులు (4 ఫోర్లు, సిక్స్‌, 2 వైడ్లు) సమర్పించుకుని టీమిండియా కొంపముంచాడు. అప్పటి దాకా న్యూజిలాండ్‌ గెలుపుకు 66 బంతుల్లో 91 పరుగులు చేయాల్సి ఉండగా.. శార్దూల్‌ దెబ్బకు సమీకరణలు (60 బంతుల్లో 66) ఒక్కసారిగా మారిపోయాయి. మ్యాచ్‌ కివీస్‌పైపు తిరిగింది.

ఇన్నింగ్స్‌ 40వ ఓవర్‌ వేసిన శార్దూల్‌ను టామ్‌ లాథమ్‌ ఆటాడుకున్నాడు. ఆ ఓవర్‌కు ముందు 70 బంతుల్లో 77 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద ఉన్న టామ్‌.. 40వ ఓవర్‌ ఆఖరి బంతికి సింగల్‌ తీసి కెరీర్‌లో 7వ సెంచరీ (76 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లు) పూర్తి చేసుకున్నాడు. శార్దూల్‌ ఒకే ఓవర్‌లో ధారాళంగా పరుగులు సమర్పించుకోవడంతో.. న్యూజిలాండ్‌ ఆడుతూపాడుతూ లక్ష్యం దిశగా సాగుతుంది. 

ఒక్క ఓవర్‌తో మ్యాచ్‌ మొత్తాన్ని చెడగొట్టిన శార్దూల్‌ను టీమిండియా అభిమానులు ఆడుకుంటున్నారు. ఈ మాత్రం సంబరానికి ఈయనని ఆడించడం ఎందుకని మేనేజ్‌మెంట్‌పై మండిపడుతున్నారు. బ్యాటింగ్‌లో కూడా చేసిందేమీ లేదు.. ఇలాంటి వాళ్లను ఆల్‌రౌండర్‌గా ఎలా పరిగణిస్తారని సెలక్టర్లపై ధ్వజమెత్తుతున్నారు.

కాగా, ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. శ్రేయస్‌ అయ్యర్‌ (80), శిఖర్‌ ధవన్‌ (72), శుభ్‌మన్‌ గిల్‌ (50) అర్ధసెంచరీలతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది. ఆఖర్లో వాషింగ్టన్‌ సుందర్‌ (37) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడటంతో టీమిండియా 300 పరుగుల మార్కును క్రాస్‌ చేసింది. 

Videos

మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్

బెడ్ రూమ్ లోకి కింగ్ కోబ్రా ఏం చేశాడో చూడండి..

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు

విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు

ప్రభుత్వం మాది..మీ అంతు చూస్తా : Pawan Kalyan

లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్

మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM

Ding Dong 2.0: కామిక్ షో

రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

Photos

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)