Breaking News

ఐర్లాండ్‌తో మూడో టీ20.. టీమిండియా ఎలా ఉండబోతుందంటే..?

Published on Wed, 08/23/2023 - 15:39

ఐర్లాండ్‌తో ఇవాళ (ఆగస్ట్‌ 23) జరుగనున్న నామమాత్రపు మూడో టీ20లో టీమిండియా భారీ మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తుంది. 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో ఇదివరకే కైవసం చేసుకున్న భారత్‌, నేటి మ్యాచ్‌లో రిజర్వ్‌ బెంచ్‌ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చే ఛాన్స్‌ ఉంది. తొలి రెండు మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితమైన ముకేశ్‌ కుమార్‌, జితేశ్‌ శర్మ, షాబాజ్‌ అహ్మద్‌, ఆవేశ్‌ ఖాన్‌లు మూడో టీ20 బరిలోకి దిగే అవకాశం ఉంది.

ప్రసిద్ద్‌ కృష్ణ, వాషింగ్టన్‌ సుందర్‌, సంజూ శాంసన్‌, అర్ష్‌దీప్ సింగ్‌ల స్థానంలో ఈ నలుగురు బరిలోకి దిగవచ్చు. పై పేర్కొన్న నలుగురికి అవకాశం ఇస్తే ఐర్లాండ్‌లో పర్యటించిన భారత జట్టు మొత్తానికి కనీసం ఓ అవకాశం ఇచ్చినట్లవుతుంది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌ జస్ప్రీత్‌ బుమ్రా సైతం విశ్రాంతి తీసుకునే అవకాశాలు లేకపోలేదు. ఆసియా కప్‌కు ముందు అనవసర రిస్క్‌ ఎందుకుని మేనేజ్‌మెంట్‌ భావిస్తే.. బుమ్రా రెస్ట్‌ తీసుకుని, అర్షదీప్‌కు అవకాశం ఇస్తాడు.

అప్పుడు జట్టు కెప్టెన్‌గా రుతురాజ్‌ గైక్వాడ్‌ వ్యవహరిస్తాడు. ఆసియా క్రీడల్లో రుతు ఎలాగూ టీమిండియాకు నాయకత్వం వహించాల్సి ఉంది కాబట్టి, అతనికి ఈ మ్యాచ్‌ ప్రాక్టీస్‌ అయినట్లవుతుంది. మొత్తంగా ఈ మ్యాచ్‌లో టీమిండియా రిజర్వ్‌ బెంచ్‌కు పరీక్షగా మారనుంది. మరోవైపు ఐర్లాండ్‌ సైతం ఒకటిరెండు మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఆ జట్టు కూడా రిజర్వ్‌ బెంచ్‌కు అవకాశం ఇచ్చే ఛాన్స్‌ ఉంది. అయితే భారత్‌లా భారీ ప్రయోగాలు కాకుండా ఒకటి, రెండు మార్పులకు ఆస్కారం ఉంటుంది.

ఇదిలా ఉంటే, ఇప్పటివరకు జరిగిన రెండు టీ20ల్లో ఇద్దరు ఐర్లాండ్‌ బ్యాటర్లు, ఓ టీమిండియా బ్యాటర్‌ హాఫ్‌ సెంచరీలు చేశారు. ఐర్లాండ్‌ తరఫున ఆండ్రూ బల్బిర్నీ (72), బ్యారీ మెక్‌కర్తీ (51) అర్ధశతకం చేయగా.. టీమిండియా తరఫున రుతురాజ్‌ గైక్వాడ్‌ (58) మాత్రమే హాఫ్‌ సెంచరీ మార్కును అందుకున్నాడు. ఇక ఈ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల విషయానికొస్తే.. ముగ్గురు టీమిండియా బౌలర్లు 4 వికెట్లు పడగొట్టారు. బుమ్రా,  బిష్ణోయ్‌, ప్రసిద్ధ్‌లు మ్యాచ్‌కు రెండు చొప్పున తలో 4 వికెట్లు పడగొట్టారు. ఐర్లాండ్‌ బౌలర్‌ క్రెయిగ్‌ యంగ్‌ 3 వికెట్లు పడగొట్టాడు. 

ఐర్లాండ్‌తో మూడో టీ20కి టీమిండియా (అంచనా): జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్‌)/అర్షదీప్‌ సింగ్‌, రుతురాజ్ గైక్వాడ్ (వైస్‌ కెప్టెన్‌/కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేశ్‌ శర్మ (వికెట్‌కీపర్‌), శివమ్ దూబే, షాబాజ్‌ అహ్మద్‌, రవి బిష్ణోయ్ , ముకేశ్‌ కుమార్‌, ఆవేశ్‌ ఖాన్‌

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)