Breaking News

IND VS IRE 3rd T20: వర్షం కారణంగా మ్యాచ్‌ రద్దు

Published on Wed, 08/23/2023 - 21:28

భారత్‌-ఐర్లాండ్‌ మధ్య ఇవాళ (ఆగస్ట్‌ 23) జరగాల్సిన నామమాత్రపు మూడో టీ20 వర్షం కారణంగా రద్దైంది. మ్యాచ్‌ ప్రారంభానికి ముందు నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో కనీసం టాస్‌ కూడా పడకుండానే మ్యాచ్‌ వర్షార్పణమైంది. ఫలితంగా 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్‌ 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో టీమిండియానే విజయం సాధించిన విషయం తెలిసిందే. డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో తొలి టీ20లో 2 పరుగుల తేడాతో నెగ్గిన భారత్‌.. రెండో టీ20లో 33 పరుగుల తేడాతో గెలుపొందింది.   

టాప్‌ స్కోరర్‌గా రుతురాజ్‌..
కాగా, ఈ సిరీస్‌లో టీమిండియా ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (2 మ్యాచ్‌ల్లో 77 పరుగులు) టాప్‌ స్కోరర్‌గా ఉండగా, ఐరిష్‌ బ్యాటర్‌ ఆండ్రూ బల్బిర్నీ (2 మ్యాచ్‌ల్లో 76) సెకెండ్‌ టాప్‌ రన్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఈ సిరీస్‌లో ఇద్దరు ఐర్లాండ్‌ బ్యాటర్లు, ఓ టీమిండియా బ్యాటర్‌ హాఫ్‌ సెంచరీలు చేశారు. ఐర్లాండ్‌ తరఫున ఆండ్రూ బల్బిర్నీ (72), బ్యారీ మెక్‌కర్తీ (51) అర్ధశతకం చేయగా.. టీమిండియా తరఫున రుతురాజ్‌ గైక్వాడ్‌ (58) మాత్రమే హాఫ్‌ సెంచరీ మార్కును అందుకున్నాడు. 

ఇక ఈ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లుగా టీమిండియా బౌలర్లు బుమ్రా,  బిష్ణోయ్‌, ప్రసిద్ధ్‌ నిలిచారు. ఈ ముగ్గురు మ్యాచ్‌కు రెండు చొప్పున  తలో 4 వికెట్లు పడగొట్టారు. ఐర్లాండ్‌ బౌలర్‌ క్రెయిగ్‌ యంగ్‌ 3 వికెట్లు పడగొట్టాడు. 

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు