Breaking News

ఐదో టెస్టు నుంచి కీలక బౌలర్‌ అవుట్‌.. ప్రకటించిన ఇంగ్లండ్‌

Published on Fri, 02/23/2024 - 10:59

India vs England Test Series 2024: ఇంగ్లండ్‌ స్పిన్నర్‌ రెహాన్‌ అహ్మద్‌ స్వదేశానికి పయనమయ్యాడు. టీమిండియాతో మిగిలిన టెస్టుల నుంచి అతడు తప్పుకొన్నాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు ధ్రువీకరించింది. 

వ్యక్తిగత కారణాల దృష్ట్యా రెహాన్‌ అహ్మద్‌ ఇంగ్లండ్‌కు పయనమయ్యాడని తెలిపింది. భారత్‌తో ఐదో టెస్టుకు అతడు అందుబాటులో ఉండడని తెలిపిన బోర్డు.. రెహాన్‌ అహ్మద్‌ స్థానంలో ఇతర ఆటగాడెవరికీ చోటు ఇవ్వలేదని వెల్లడించింది. 

కాగా 19 ఏళ్ల రెహాన్‌ అహ్మద్‌.. రైటార్మ్‌ లెగ్‌బ్రేక్‌ స్పిన్నర్‌ . గతేడాది పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్‌ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. అరంగేట్ర మ్యాచ్‌లో మొత్తంగా ఏడు వికెట్లు తీసిన అహ్మద్‌.. టీమిండియాతో తాజా సిరీస్‌లో తొలి మూడు మ్యాచ్‌లలో ఆడాడు.

లీచ్‌ లేని లోటు తీర్చాడు
హైదరాబాద్‌, విశాఖపట్నం, రాజ్‌కోట్‌ టెస్టులలో ఆడిన ఈ యువ బౌలర్‌ మొత్తంగా పదకొండు వికెట్లు పడగొట్టాడు. సీనియర్‌ స్పిన్నర్‌ జాక్‌ లీచ్‌ జట్టులో లేనిలోటు తీర్చాడు. అయితే, రాంచి వేదికగా నాలుగో టెస్టులో మాత్రం అతడికి తుదిజట్టులో చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో ఫ్యామిలీ ఎమర్జెన్సీ దృష్ట్యా రెహాన్‌ అహ్మద్‌ సెలవు కోరినట్లు ఇంగ్లండ్‌ బోర్డు వెల్లడించింది.

ధర్మశాల టెస్టులో అతడు ఆడబోడవడం లేదని స్పష్టం చేసింది. కాగా జాక్‌ లీచ్‌ ఇప్పటికే గాయం కారణంగా దూరం కాగా.. రెహాన్‌ రూపంలో మరో కీలక స్పిన్నర్‌ జట్టుకు దూరం కావడం ఎదురుదెబ్బ లాంటిదే!

ఇదిలా ఉంటే.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా ఇంగ్లండ్‌పై రెండింట గెలిచి 2-1తో ఆధిక్యంలో ఉంది. మరోవైపు.. ఈ సిరీస్‌ ఆరంభానికి ముందే ఇంగ్లండ్‌ బ్యాటర్‌ హ్యారీ బ్రూక్‌, టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లి వ్యక్తిగత కారణాల దృష్ట్యా జట్లకు దూరమైన విషయం తెలిసిందే.

చదవండి: IND vs ENG: దురదృష్టమంటే నీదే భయ్యా.. క్లీన్‌ బౌల్డ్‌ చేసి! వీడియో వైరల్‌

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)