Breaking News

ఇషాన్‌ కిషన్‌ కాదు.. పంత్‌కు రీప్లేస్‌మెంట్‌ అతడే..!

Published on Thu, 07/24/2025 - 17:32

మాంచెస్టర్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో (తొలి రోజు) టీమిండియా వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ రిషబ్‌ పంత్‌ గాయపడిన విషయం తెలిసిందే. పంత్‌ గాయం తీవ్రత అధికంగా ఉన్నా జట్టు అవసరాల దృష్ట్యా రెండో రోజు బ్యాటింగ్‌కు దిగి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే పంత్‌ సేవలు కేవలం బ్యాటింగ్‌కు మాత్రమే పరిమితమవుతాయని, అతను వికెట్‌కీపింగ్‌ చేయడని బీసీసీఐ స్పష్టం చేసింది.

జట్టు అవసరాల దృష్ట్యా పంత్‌ను ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు వాడుకున్నా, ఐదో టెస్ట్‌లో మాత్రం అతను బరిలోకి దిగే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో పంత్‌కు ప్రత్యామ్నాయంగా ఎవరో ఒకరిని ఎంపిక​ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ధృవ్‌ జురెల్‌ అందుబాటులో ఉన్నా, కవర్‌ ప్లేయర్‌ ఎంపిక​ తప్పనిసరి అవుతుంది.

నిన్నటి వరకు పంత్‌కు ప్రత్యామ్నాయంగా ఇషాన్‌ కిషన్‌ను ఎంపిక చేస్తారని ప్రచారం జరిగినా, తాజాగా ఓ కొత్త పేరు తెరపైకి వచ్చింది. చివరి టెస్ట్‌ కోసం పంత్‌కు రీప్లేస్‌మెంట్‌గా తమిళనాడుకు చెందిన రైట్‌ హ్యాండ్‌ వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ నారాయణన్‌ జగదీశన్‌ పేరు దాదాపుగా ఖరారైనట్లు సమాచారం. 

29 ఏళ్ల జగదీశన్‌ ఐపీఎల్‌లో సీఎస్‌కే, కేకేఆర్‌ తరఫున ఆడాడు. చివరిగా అతను 2023 సీజన్‌లో కేకేఆర్‌లో ఉన్నాడు. జగదీశన్‌ ఐపీఎల్‌లో పెద్దగా రాణించకపోయిన దేశవాలీ క్రికెట్‌లో అద్భుతాలు చేశాడు. లిస్ట్‌-ఏ క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ (277).. లిస్ట్‌-ఏ క్రికెట్‌లో వరుసగా ఐదు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేసిన వరల్డ్‌ రికార్డు ఇతని ఖాతాలో ఉన్నాయి. వికెట్‌కీపర్‌గానూ జగదీశన్‌కు మంచి రికార్డే ఉంది. 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)