Breaking News

భారత్‌తో టెస్టులకు ముందు.. ఇంగ్లండ్‌ బోర్డు కీలక నిర్ణయం!

Published on Wed, 04/30/2025 - 15:17

సొంతగడ్డపై సమ్మర్‌ సీజన్‌ షెడ్యూల్‌ నేపథ్యంలో ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.  న్యూజిలాండ్‌ మాజీ పేసర్‌ టిమ్‌ సౌథీ (Tim Southee)ని కోచింగ్‌ సిబ్బందిలో చేర్చుకునే దిశగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

కాగా గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కుఇంగ్లండ్‌ దిగ్గజ పేసర్‌ జేమ్స్‌ ఆండర్సన్‌ (James Anderson) వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అతడు ఇంగ్లిష్‌ జట్టు ఫాస్ట్‌ బౌలింగ్‌ కన్సల్టెంట్‌గా అతడు పనిచేశాడు. అయితే, దేశవాళీ క్రికెట్‌లో లంకాషైర్‌ తరఫున ఆడేందుకు ఆండర్సన్‌ సిద్ధం కావడంతో ఆ పోస్టు ఖాళీ అయింది.

ఈ నేపథ్యంలోనే కివీస్‌ మాజీ ఆటగాడు టిమ్‌ సౌథీకి ఇంగ్లండ్‌ బోర్డు ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది. కాగా ఇంగ్లండ్‌ టెస్టు, పరిమిత ఓవర్ల క్రికెట్‌ హెడ్‌కోచ్‌గా న్యూజిలాండ్‌ దిగ్గజం బ్రెండన్‌ మెకల్లమ్‌ పనిచేస్తున్న విషయం తెలిసిందే. రెడ్‌బాల్‌ క్రికెట్‌లో మెకల్లమ్‌ ‘బజ్‌బాల్‌’తో సరికొత్త ప్రయోగాలు చేసి సఫలమైనా.. వైట్‌ బాల్‌ క్రికెట్‌లో మాత్రం అనుకున్న ఫలితాలు రాబట్టలేకపోతున్నాడు.

ఇప్పటికే న్యూజిలాండ్‌ నుంచి జీతన్‌ పటేల్‌ కూడా
ఇదిలా ఉంటే.. సౌథీతో మెకల్లమ్‌కు మంచి అనుబంధం ఉంది. అతడి చొరవతోనే ఇంగ్లిష్‌ జట్టు బోర్డు ఈ కివీస్‌ పేసర్‌ను కోచింగ్‌ సిబ్బందిలోకి తీసుకోవాలని భావిస్తున్నట్లు బీబీసీ తన కథనంలో పేర్కొంది.

కాగా మెకల్లమ్‌ జట్టులో ఇప్పటికే న్యూజిలాండ్‌ నుంచి జీతన్‌ పటేల్‌ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇంగ్లండ్‌ జట్టు స్పిన్‌ బౌలింగ్‌ కోచ్‌గా అతడు సేవలు అందిస్తున్నాడు. ఇక సౌథీ కూడా చేరితే హెడ్‌కోచ్‌తో కలిపి ఈ సంఖ్య ​మూడుకు చేరుతుంది.

టీమిండియాతో ఐదు టెస్టులు
ఇక 36 ఏళ్ల టిమ్‌ సౌథీ గతేడాది డిసెంబరులో రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. న్యూజిలాండ్‌ తరఫున 107 టెస్టులు, 161 వన్డేలు, 125 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఈ రైటార్మ్‌ పేసర్‌... ఆయా ఫార్మాట్లలో 391, 221, 164 వికెట్లు తీశాడు.

కాగా ఇంగ్లండ్‌ జింబాబ్వేతో ఏకైక టెస్టుతో తమ వేసవి సీజన్‌ను మొదలుపెట్టనుంది. ఆ తర్వాత వెస్టిండీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌ ఆడనుంది. అనంతరం జూన్‌ 20 నుంచి టీమిండియాతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడనుంది. 

చదవండి: ఇంగ్లండ్‌ టూర్‌కు ఆర్సీబీ కెప్టెన్‌.. కరుణ్‌, సాయి సుదర్శన్‌కు కూడా పిలుపు..?
 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు